పుట:AndhraRachaitaluVol1.djvu/561

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెలువరించిన కృతులలో ముప్పాతికపాలు గురులింగశాస్త్రిగారివే యనవలయును. ఇట్టి బహుగ్రంథములు రచించిన విద్వాంసుల వంశము నరసింహశాస్త్రి గారిది.

శ్రీ నరసింహ శాస్త్రిగారు అద్యతనాంధ్రకవులలో సంప్రదాయ సిద్ధమైన రచన సాగించుచున్నారు. ఆయన దేవిభాగవత రచన నేడు సుప్రసిద్ధ మగుచున్నది. నారాయణభట్టు - రుద్రమదేవి మున్నగు నవలలు వారివి మక్కువతో బఠించుచున్నాము. నాటికలు కూడ దరచుగా నరసింహశాస్త్రిగారు వ్రాయుచున్నారు. వారి విమర్శనములు పత్త్రికలలో గనుచుందుము. అనగా వీరికలమునకు బహుముఖములుగా సాగునేర్పు కలదని స్పష్టపడుచున్నది. ఇట్టి ప్రముఖ రచయిత జీవితవిశేషములు పేర్కొనదగినవి.

1918 వరకు నరసింహ శాస్త్రిగారు గుంటూరున ' ఇంటరు ' చదివిరి. పదపడి, పచ్చయప్ప కళాశాలలో బి. ఏ. చదివి యుత్తీర్ణత. పట్టభద్రులయిన తరువాత, గుంటూరు కళాశాలలో రెండేండ్లు ఉద్యోగము. 1925 సం||లో బి. యల్. పరీక్షలో నెగ్గి గుంటూరిలో న్యాయవాదిత్వమునకు బ్రారంభము చేసినారు. 27 సం|| నుండి ' రేపల్లె ' మకాము మార్చి నేటిదాక నక్కడనే వృత్తినిర్వహణము. సంస్కృతాంధ్రములు గురుముఖమున బఠించినారు. పదవయేటనే కవి కావలె నన్న కోరిక నరసింహ శాస్త్రిగారిలో మొలకయెత్తినది. ఈ మొలకను దోహదముచేసి, మొక్కగా బెంచిన యుదారులు శ్రీ శివశంకర శాస్త్రిగారు. కొడవటిగంటి వేంకట సుబ్బయ్య, త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి, పెద్దిభట్ల పూర్ణశర్మ, కోపల్లె శివకామేశ్వర రావు - మున్నగు ప్రథమ ' సాహితీసమితి ' కవుల స్నేహముతో మన నరసింహశాస్త్రిగారికి నవ్యసాహిత్యములో నొక వెలుగు కానిపించినదట. పదునెనిమిదేండ్ల వయస్సు నిండువరకు వీరు వీరగ్రాంథిక