నోరి నరసింహ శాస్త్రి
1900
హరితస గోత్రులు. ఆపస్తంబ సూత్రులు. జన్మస్థానము: గుంటూరు. ప్రకృతనివాసము: రేపల్లె. తల్లి: మహాలక్ష్మమ్మ. తండ్రి: హనుమచ్ఛాస్త్రి. జననము: వికారి వత్సర మాఘ శుద్ధ సప్తమి. 6-2-1900 సం|| తేది. రచనలు: 1. గీతమాలిక 2. భాగవతావరణము (పద్యనాటిక) 3. సోమనాథ విజయము (నాటకము) 4. ఖేమాభిక్కుని 5. వరాగమనము 6. ఆత్మమృతి 7. తేనెతెట్టె 8. పతంగయాత్ర 9. స్వయంవరము. 10. షణ్ణవతి (ఇత్యాది నాటికలు, కావ్యములు) 11. నారాయణభట్టు 12. రుద్రమదేవి (నవలలు) ఇంకను, అనేక కథలు, వ్యాసములును.
శిష్టాచార సంపదలో నోరివారి వంశము పేరుమోసినది. నరసింహ శాస్త్రిగారి తండ్రి హనుమచ్ఛాస్త్రి గారు గుంటూరు "మిషను కళాశాల"లో సంస్కృతాంధ్రాధ్యాపకులు. వీరు పాదుకాంత దీక్షితులు. వారి తండ్రి గోపాల కృష్ణయ్యగారు మంత్రశాస్త్రకోవిదులు. ఇట్టి శిష్టవంశమున నరసింహ శాస్త్రిగారి పుట్టుక. వీరి పినతండ్రి గురులింగశాస్త్రిగారు సుగృహీతనాములు. వారు చెన్నపురి తొండమండలము హైస్కూలున పండిత పదవిలో నుండెదివారు. వ్యాకరణము, వేదాంతము, జ్యోతిషము, మున్నగు శాస్త్రములలో వీరిది గట్టిచేయి. తెలుగువచనములో ననేక పురాణములు వ్రాసినారు. భగవద్గీతా గుప్తార్థ ప్రకాశిక వీరు వ్రాసినదే. ఆంధ్రవాజ్మయ సూచికలో, ముద్రితములైన వీరి రచనలు చాల నున్నట్లు కనబడుచున్నది. మహాభారతము, స్కాందపురాణము, మార్కండేయ పురాణము, జైమిని భారతము మున్నగు గ్రంథములకు దెలుగువచనములు వీరు రచించియున్నారు. బరూరి త్యాగరాయ శాస్త్రులు అండు సన్సువారు వెనుక