పుట:AndhraRachaitaluVol1.djvu/559

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ గుణములుగల కావ్యములకు దిపావళి రాశి. అందుకే, వేదులవారి పేరు విన్నవెంటనే, ఆకూర్పు స్మరణకు వచ్చుట. శాస్త్రిగారు కొన్ని నాటకములు, కథలు, విమర్శనములు వ్రాసిరి. ఏవి వ్రాసినను, ఆయన పద్యకావ్యరచనలోనే శ్రద్ధధానులు.

ఈ ' గౌతమీకోకిలము ' కాంక్ష యిటులున్నది:

కానుకనై ధరాధిపుల కాళ్లకడం బొరలాడి వాడిపో
లేను, ధరాపరాగ పటలీ మలినమ్మగు ద్వారతోరణా
స్థానమునం దురిం బడగజాలను, దోసిటి పేరి ఘోరకా
రా నరకమ్మునం దుసురు రాల్పగలేను నిమేషరక్తిమై.

నీచపు దాస్యవృత్తి మననేరని శూరట మాతృదేశ సే
వా చరణమ్మునం దనువు లర్పణ జేసినవారి పార్థివ
శ్రీ చెలువారుచోట, దదనృగ్రుచులన్ వికసించి, వాసనల్
వీచుచు రాలిపోవగ వలెం దదుదాత్త సమాధి మృత్తికన్.