పుట:AndhraRachaitaluVol1.djvu/562

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాదులు. తరువాత, వ్యావహారిక భాషావాదులు. పద్యరచనకూడ వ్యావహారికములోనే సాగింపవలెనని కొన్నాళ్లు వీరిపట్టు. అది క్రమముగా సడలి పద్యమునకు గ్రాంథికము, గద్యమునకు వ్యావహారికము కావలెనని కొంతకాలము. ఇప్పుడు పూర్తిగా నరసింహశాస్త్రి గారిలో గ్రొత్తమారుపు. వ్యావహారికభాష వచనరచనకుగూడ అనుకూలము కాదని నిశ్చయము చేసికొన్నారట. శాస్త్రాది విషయములు నిరూపించు వ్యాసములు, పూర్వకాలమునకు సంబంధించిన కథలు, నవలలు గ్రాంథికవాణిలోను, నేటి కాలమునకు సంబంధించిన కథలు, నాటికలు, సిద్ధాంతములు చేయని వ్యాసములు వ్యావహారిక వాణిలోను నుండవలయునని నరసింహశాస్త్రిగా రిప్పటికి జేసికొన్న సిద్ధాంతము. 1930 నుండి, శాస్త్రిగారిలో కర్మశ్రద్ధ ప్రబలినది. 41 సం|| నుండి పూర్ణదీక్ష. వంశీయమైన ధర్మము తప్పింప దరముకాదు.

శ్రీ నరసింహశాస్త్రిగారికి గథారచనలోను శ్రద్ధ యున్నది. గులాబిపువ్వు, శ్యామసుందరుడు, గానభంగము, చేసుకున్నవారికి చేసుకున్నంత, భవిష్యత్తు, వధూసర - ఇత్యాదులయిన వీరి కథలు సాహితి, సఖి, భారతి, ఆంధ్రవార్షిక సంచికలలో చూచియుందురు. శాస్త్రిగారి నాటికలు సోమనాధ విజయము, ఖేమార్ఖుని, వరాగమనము, ఆత్మమృతి, పతంగయాత్ర, షణ్ణవతి, ఇత్యాదులు రసికమానసములు కరగించునవిగా నున్నవి. శ్రీ శివశంకరశాస్త్రిగారి వలెనే వీరెక్కువగా బద్యనాటికలు వ్రాయుటకు మక్కువ చూపినారు. ప్రధానముగా నరసింహశాస్త్రిగారి ' నారాయణభట్టు ' పేర్కొనదగిన మంచి నవల. వీరి గద్యరచనా విధానము చాల సరస మధురమైనది. పాత్రల సంభాషణము ఉదాత్తముగా నడపింతురు. కథాసంవిధానము మీద కంటె, విషయ విమర్శనము మీద వీరు ప్రీతిచూపెదరు. ఈ గుణము " నారాయణభట్టు " లో గన నగును. పలుమొగాల వెలి విరిసిన