Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/543

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి

1897

వైదికబ్రాహ్మణులు. తల్లి: బుచ్చినరసమ్మ. తండ్రి: సుబ్బయ్య. నివాసము: సికిందరాబాదు. జననము: 10-2-1897 సం. గ్రంథములు: 1. తత్సమ చంద్రిక 2. కావ్యాలంకార సంగ్రహము (వ్యాఖ్యాన సహితము) 3. జాతక కథాగుచ్ఛము (2 భాగములు) 4. కీరసందేశము - ద్వంద్వయుద్ధము. 5. గోవర్ధానాచార్య సప్తశతీ సారము 6. పువ్వులతోట (ఖండకావ్యసంపుటి) 7. కావ్యమంజరి 8. నడుమంత్రపు సిరి (అధిక్షేప కావ్యము) 9. ఖడ్గతిక్కన 10. అమృతకనములు 11. వాసవదత్త 12. రేణుక విజయము 13. వివేకానందము (కావ్యములు) ఇత్యాదులు.

జాతక కథాగుచ్ఛాది పద్యరచనల వలనను, తత్సమ చంద్రికాది లక్షణ గ్రంథరచనలవలనను సన్నిధానము సూర్యనారాయణ శాస్త్రి గారిపేరు తెనుగువారు లెస్సగా విన్నదియై యున్నది. ఆయన మంచి పండితులు. గొప్పకవులు. వ్యాకరణమున, అలంకార శాస్త్రమున, వీరు ప్రధానముగా గృషిచేసిరి. వారి వ్యాకరణ కృషికి తత్సమచంద్రికయు, అలంకార శాస్త్రకృషికి కావ్యాలంకార సంగ్రహ వ్యాఖ్యయు నిదర్శనములుగా నిలబడు గ్రంథములు. వేదాంతమున, ప్రస్థానత్రయపాఠము చేసిరి. ఇట్టి వ్యుత్పత్తి గౌరవముతో, శ్రీ వేలూరి శివరామ శాస్త్రిగారి గురుత్వముతో సూర్యనారాయణ శాస్త్రిగారు సహజమైన కవిత్వమును వృద్ధిపరుచుకొని, యెన్నోకృతులు రచించిరి, రచించుచున్నారు.

శ్రీశాస్త్రిగారి పట్టుదల మిగుల మెచ్చ దగినది. ఆయన కావ్యాలంకార సంగ్రహవ్యాఖ్య 700 పుటలు పరిమితిగల గ్రంథము. ఆలంకారికుల సర్వసిద్ధాంతములు పరిశీలన చేసి వా రావ్యాఖ సంఘటించిరి. కావ్య