పుట:AndhraRachaitaluVol1.djvu/544

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్వరూపము - రససిద్ధాంతము మున్నగు స్థలములలో మన ప్రాచీనాలంకారికులు భిన్నవిభిన్నములుగా బ్రదర్శించిన మతములు వీరు గుఱుతెంచి వాని నెల్ల నీ వ్యాఖ్యలో బయలుపఱుచుట వీరి పరిశ్రమకు దార్కాణమైన విషయము.

వారి తత్సమచంద్రిక యు నమోఘ కృషి ఫలితము. సిద్ధాంత కౌముది, మఱి యితర పాణినీయవ్యాఖ్యాన గ్రంథములు శాస్త్రి గారు బాగుగా బరిశీలనము చేసినా రని ఈ కృతి తెలుపుచున్నది. పయి రెండు లక్షణ గ్రంథములు వీరికి లాక్షణికులలో మంచి స్థానము నిచ్చుటకు జాలియున్నవి.

ఇది యిటులుండగా, సప్తశతీసారము, జాతక కథాగుచ్ఛము, వివేకానందము, వాసవదత్త మొదలయిన వీరి పద్యరచనలు పాఠ్యములై ప్రసిద్ధిగొన్నవి. తెలుగు పలుకుబడి వీరిది సుఖముగానుండును. వ్యాకరణవిశేష విశిష్టములైన ప్రయోగములు వీరి కవితలో దఱచు అన్వయములో నెడనెడ దిక్కనగారి తీరులు, యతిప్రాసలకు దడవు కొన్నటులుండదు. కాని, శాస్త్రిగారు యతి ప్రాసబంధములు పద్యకవితకు దగిలింపరాదని యెకప్పుడు వాదము నెఱపినవారు.

కావించె నేపతి తన వజ్రకాయంబు
ఆహా! వివరించి వ్రాయుటకు బట్టదు కావ్యమొకండు

ఇత్యాదులుగా గొన్ని పద్యములలో యతులు తప్పించి చూపిరి. ఈ పద్ధతి సార్వత్రికము చేయుట నచ్చకయే, వారు మరల గృతుల నన్నింట సలక్షణత పాటించుచునే వచ్చుచున్నారు. అచ్చటిచ్చటివి సూర్యనారాయణ శాస్త్రిగారి కావ్యములనుండి మచ్చు తునుకలు.

క. మీసాల తేనె నాదగు
నీ సంస్కృతి సుఖము కొఱకు గృహమేధము గో