పుట:AndhraRachaitaluVol1.djvu/541

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిలువుటద్ద మైనది. "హిందీ - గాంధీ - ఖద్దరు" ఈమూడును శాస్త్రిగారి సిద్ధాంతమునకు విరుద్ధమైన పదార్థములు. బౌద్ధుల త్రిరత్నములవలె, భారతీయుల పారాయణములోనున్న యీమూడు శబ్దములను విమర్శించుచున్న శాస్త్రిగారి గుండెనిబ్బరమునకు అబ్బురమైన పట్టుదలకు మనము మెచ్చవలయును. 'ప్రబుద్ధాంధ్ర' తొమ్మిదియేండ్లునడచి మంచిప్రసిద్ధిలో నాగిపోయినది. సుబ్రహ్మణ్య శాస్త్రిగారి జీవన వైభవమునకు 'ప్రబుద్ధాంధ్ర' సాగిన దశాబ్దము మెఱుగు కాలము. 1934 సం.నుండి ఆపత్రికలో పద్యప్రకటనము నషేధించి, వచన రచనలే ప్రచురించెడివారు. కావున వచనవాజ్మయమున కాపత్త్రికచేసిన మేలు మఱవరానిది. శాస్త్రిగారి సర్వగ్రంధరచనము నొకయెత్తు. ఈ పత్త్రికా ప్రచురణ మొకయెత్తుగా సాగినది. సుబ్రహ్మణ్యశాస్త్రిగారు 1916 మొదలు నాలుగేండ్లు కళాభివర్థనీ నాటకసమాజము నడపిరని యిచట బేరుకొనుట వారికళాభిరతికి గుఱుతు. నాటకములలో స్త్రీ - పురుషవేష ధారణము చేసెడివారనియు వినుకలి. సంగీత కళపై వీరికెక్కువ మక్కువ. సుమారు నూరుకృతులు గురుముఖమున జెప్పుకొనిరట. కాని, గొంతెత్తి పాడగా నేను వినలేదు. 1947 నుండి సంగీత సాహిత్య సభలు జరిపించుచు వీరు రాజమహేంద్రవరమున నూత్నకళా గౌరవము చాటు చుండుట ప్రశంసింప దగిన సంగతి. నన్నయ - శ్రీనాధ జయంతులు జేగీయ మానముగా నడపించుచున్న శాస్త్రిగారి ప్రాచీన సారస్వతాదరణము నమస్కరణీయమైనది.

ఇంక, ప్రకృతము, వారు చిన్నకథలు వ్రాయుదురు. కాని, అవి గుణమున, పరిమాణమున గూడ పెద్దకథలు. సంభాషణములసంతనలో నింత పరిపక్వత గల కథారచయితలు తక్కువ. పాత్రల మాటలలో వ్యక్తులతీరులు, భంగీమములు సుస్పష్టముగా మనకు గోచరింప