Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/539

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లేదా అని చూసుకోకుండానే నేను నాటకరచనకి పూనుకున్నాను. నేను మొట్టమొదట రాసిన నాటకం - అంటే, నాకునేనై రాసిననాటకం-"వారకాంత". కాని దాని కర్తృత్వం నేను మరచిపోతున్నాను. నా నాటకాలలో నేను చెప్పుకోగలవి "ప్రేమపాశం", "నిగళబంధనం", "రాజరాజు"-ఇవి. వీటిలో ఒకటీ రంగస్థలం ఎక్కలేదు. చదివినవారు మాత్రం అనుకూలంగానూ ప్రతికూలంగాను కూడా మాట్టాడారు. కొన్ని ఏకాంకికలున్నూ రాశాను. వాటిలో నాకు మిక్కిలీ ప్రీతిప్రాత్రం "కలంపోటు'.--"

ఈ 'వారకాంత' నాటకములో బద్యములుకూడ జేర్చినారు. ఇది ప్రత్యేకించి చెప్పుటలో, సుబ్రహ్మణ్య శాస్త్రిగారు 1934 నుండి బొత్తిగా పద్యంధ ప్రాతికూల్యము వహించుట కారణము. ఈప్రతికూల భావము వారికి పద్యము హృద్యముగావ్రాయలేక పోవుట వలన గలిగినది కాదని యీక్రింది పద్యము సాక్ష్యము చూపుచున్నాను.

బ్రతుకు ఘటించు నోషది కరాళవిషంబున, నుక్కుతీవలం
దతి మృదునాదమున్, దహనునందు ప్రకాశము, నుప్పునీటిలో
రతసము లాణిముత్తెములు రాళ్ళను, కప్పకు జీవనంబులున్
చతురత గూర్తు వెయ్యది యసాధ్యమునీకిక దీనబాంధవా!

"అత్త - అల్లుడు" - "అలంకృతి" - "అభిసారిక" - "బాలిక, తాత" మొదలగు ఖండకావ్యములు సుబ్రహ్మణ్య శాస్త్రిగారు. మనోహరముగా రచించినవి యున్నవి.

శ్రీ శాస్త్రిగారి మొదటినవల 'మిధునానురాగము' అట్లే మొదటి కథ 1915 పిబ్రవరిలో వెలువడినది. "ఇరువుర మొక్కచోటికే పోదము" అని దానిపేరు. "ఇదియాది, 1923 సం. దాక గ్రాంధికములోనే శాస్త్రిగారు రచనలు సాగించుచు వచ్చిరి. క్రమముగా రెండుమూడేండ్లకు సంపూర్ణముగా వ్యావహారిక భాషావతరణము. విశేషమేమనగా