వేంకట రామకృష్ణులను శాస్త్రిగారికి కవితా గురువులుగా జేసినది. 1910-11 సం.లో రామకృష్ణకవుల సాహచర్యమున నెన్నో సాహిత్యపు మెలకువలు, కవిత్వపు బొలపములు శాస్త్రిగారు గుర్తింప గలిగినారు. ఇరువదియేండ్ల యీడు వచ్చుసరికి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు సానబెట్టిన రత్నము.
ప్రధానముగా, వీరి జీవితములో మెచ్చదగిన విషయము, వీ రే యధికారిని దోసిలియొగ్గి "నెలకూలి చాకిరీ" కొడ బడకుండుట - వీరివలె నాత్మగౌరవము నధికముగా నిలబెట్టుకొనువారు తక్కువ. అట్లని, పరనిరపేక్షముగా జీవింపగల విత్తవంతుడును కాడు. ఆయనలోని తలపులు పయిమాటలు నొకటై సూటిగానుండును. దాపఱికము లేదు. చెప్పినదానికి దిరుగు డరాదు. ఎదుటివాడు సహృదయుడయినచో హృదయము ముద్దగట్టి ముందుబెట్టును. కానిచో, పిలిచినను, పెడమొగము పెట్టును. సుబ్రహ్మణ్యశాస్త్రిగారి యథార్థవాదిత బంధు విరోధమునకు గారణము కారానిది. ఇది యిటులుండగా, వారి తొలిరచన 'వారకాంత^ యను నాటకము. కవిత్వము నాటకాంతము కావలయునన్న పెద్దలమాట సుబ్రహ్మణ్యశాస్త్రిగారు ముందునకు దెచ్చినారు. ఈసందర్భమున వారొకప్పుడు చెప్పిన 'రేడియో' ప్రసంగము స్మరణకు వచ్చుచున్నది.
"పాఠకునకూ, ద్రష్టకూ రసానుభవం కలిగించి తన సందేశం స్ఫుటంగా వినిపించాలంటే, రచయితకు, తక్కిన కావ్యాలకంటే నాటకం చాలా మంచిసాధనం. కాని నాటకరచన చాలా కష్టమైనది. కావ్యసామాన్యం రచించే టప్పటికంటే నాటకం రచించేటప్పుడు రచయిత గొప్పబాధ్యత వహించ వలసివుంటుంది. తనజాతివారికి సభ్యత అలవడజేయడమూ - అదితప్పిపోకుండా చూడడమూ - ఇదే ఆబాధ్యత. కవికి ఇంతశక్తీ బాధ్యతా ఉందని తెలుసుకొన్నప్పుడు, శక్తి ఉందా