పుట:AndhraRachaitaluVol1.djvu/536

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

1891

వెలనాటి శాఖీయ బ్రాహ్మణుడు. కౌశికసగోత్రుడు. తల్లి: మహాలక్ష్మీ సోదెమ్మ. తండ్రి: లక్ష్మీపతి సోమయాజులు. జన్మస్థానము: పొలమూరు (రామచంద్రపురము తాలూకా) నివాసము: రాజమహేంద్రవరము. జననము: 23 ఏప్రిలు 1891. ఖర సంవత్సర చైత్ర శుద్ధ చతుర్దశీ గురువాసరము. రచనలు: 1. మహాభక్తవిజయము 2. విరాగనలు 3. భారత రమణీమణులు 4. ప్రేమపాశము (నాటకము) 5. వారకాంత. 6. మిధునానురాగము 7. స్మశానవాటిక 8. రక్షాబంధనము 9. అనాధబాలిక. 10. వీరపూజ. 11. రాజరాజు (నాటకము) 12. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి చిన్నకథలు (నేటికి ముద్రితములగు సంపుటములు) 13. పాణిగృహీణ శ్రవణానందశృంఖల 14. ఆయుర్వేద యోగ ముక్తావళి. 15. వైద్యక పరిభాష (ముద్రితములు) 16. కర్ణవధ 17. ఊరుభంగము 18. బొబ్బిలియుద్ధము. 19. నిగళబంధనము (పయి నాలుగును నాటకములు) 20. ఆత్మబలి (నవల) 21. శ్రీమద్రామాయణము (వ్యావహారిక వచనములో) 22. ఖండ కావ్యములు. ఇత్యాదు లముద్రితములు.

నేటి తెనుగు కథా రచయితలలో, మునుముందుగా జ్ఞప్తికందు కొందఱిలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగా రొకరు. ఒక రనుటకుంటే, మొదటివా రనుటయు నతిశయోక్తము కారాదు. కారణము, ఆయన వ్రాసిన ప్రత్యక్షరము సహజప్రతిభనుండి పొటమరించినది; ఆయన చేసిన ప్రతికల్పనము ప్రత్యక్షమున కవిరుద్ధమైనది; ఆయన పాత్రలచే బలికించిన ప్రతిపదము, ఇరుగుపొరుగుల మనము వినుచున్నది; ఆయన ప్రదర్శించిన ప్రతి సంవిధానము మన యనుభూతులకు దవ్వుగానిది; ఆయన కట్టిన కథ లెల్ల తెలుగుదేశపు టెల్లలు గడచిపోయినవి. ఈతీరున సుబ్రహ్మణ్యశాస్త్రిగారు అచ్చమైన తెనుగుదనమును వలచి