పుట:AndhraRachaitaluVol1.djvu/519

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నొక నూతన ప్రకరణ మారంభమైనది. గిడుగు రామమూర్తి పంతులు గారి వ్యావహారిక వాదముపై సంపూర్ణమైన విశ్వాసము పాదుకొన్నది. చింతా దీక్షితులుగారి సాహచర్యముతో వ్యావహారిక రచనా ప్రాచుర్యము కొనసాగించిరి. నేటికి, రవీంద్రుడు-షెల్లీ, భవభూతి, పెద్దన, గురుజాడ అప్పారావు ఇత్యాదు లందఱు కృష్ణశాస్త్రిగారిలో దీయతీయని తలంపులు రేపిరి. దాని ఫలమే 'కృష్ణపక్షము' ముగించిరట. 1921 జాతీయోద్యమమునకు వీరిని పురికొల్పిన వత్సరము. ఆయేడే దైవవశమున కృష్ణశాస్త్రిగారికి సతీవియోగము. ఆ పిదప పిఠాపురము హైస్కూలులో ఉద్యోగధర్మము; ద్వితీయవివాహమును. మహారాజు కృష్ణశాస్త్రిగారి జాతీయభావములు సహింపలేక యుద్యోగమునుండి తొలగించివై చెను. తరువాత మఱికొన్ని సంవత్సరములకు 1932 మొదలు 1941 వఱకు కాకినాడ కళాశాలోద్యోగము. అంతటితో దానికిని స్వస్తి. ఆత్మగౌరవమును బాటించుకొన నని కృష్ణశాస్త్రిగారు ప్రతిజ్ఞపట్టినచో, ఆయన కీపాటికి 'ప్రిన్సిపాలు' పదవి వచ్చియుండవచ్చును. ఆదురదృష్ట మాయనకు బట్టలేదు. ఇది కృష్ణశాస్త్రిగారి జీవితములో గొందఱికే విందుగూర్చుభాగము. ఈ పయిది భావుకులకు విడువరాని యాతిథ్యము.

" తలిరాకు జొంపములు సం

దుల త్రోవల నేలువాలు తుహిన కిరణ కో

మలరేఖవొ! పువుదీవవొ!

వెలదీ, యెవ్వ తెవు నీవవిటవీ వనిలోన్.

కారు మొయిళ్ళ కాటుగ పొగల్ వెలిగ్రక్కు తమాలవాటి నే

దారియు గానరాదు, నెలంతా! యెటు వోయెద నర్ధరాత్రి? ని

స్ఫార విలోచనాంధ తమసమ్ముల జిమ్ముచు వేడి వేడి ని

స్టూరుపులన్ నిశీధ పవనోర్మ వితానము మేలు కొల్పుచున్.