పుట:AndhraRachaitaluVol1.djvu/5

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వ్రాయుచున్నారు. విస్మృతాంధ్రకవి చరిత్రములు పెక్కురు బయట బెట్టుచున్నారు. తెలుగులోని కవులు సాగరములోని రత్నములు. అన్వేషించిన కొలదిని వెలువడుచునేయుందురు. మరుగు పడిన కవులను జతపరిచి క్రొత్తపరిశీలనమునుబట్టి సవరింప వలసినవి సవరించి కవిచరిత్రలు సంస్కరణ పూరణములతో పునర్ముద్రణమునకు దెచ్చుట యెంతో మేలిపని. ఎరిగినందాక, పూర్వాంధ్ర కవుల చరిత్రములు పూర్తిగ గ్రహింపబడినగాని, ఆధునిక కవిజీవితములు వ్రాసిన తృప్తి యుండదు. ఈ మహత్తర కార్య నిర్వహణమునకు బూనుకొనుట శ్రీ వీరేశలింగము పంతులుగారి పవిత్రాత్మ తృప్తికి గూడ హేతువు.

రచయితృ శబ్దము కవి, విమర్శక, పరిశోధకాది సర్వసామాన్య రచనకార వాచక మగునని యాలోచించి యిపు డీకూర్పునకు ' ఆంధ్ర రచయితలు ' అను పేరు పెట్టనాయెను. వినుకటివలె గాక, వర్తమాన సారస్వతము వేయిపడగలై విస్తరిల్లిన దనుకొంటిమి. ఒక పద్యకవుల చరిత్రములే సంధానించినచో, యావజ్జివము చరిత్రాన్వేషణము చేసిన పరిశోధకులు - సంపుటముల కొలది విలువగల విమర్శనములు వ్రాసిన పండితులు - మున్నగువారు, చరిత్ర కెక్కక మరుగుపడవలసినదేనా ? ' రచయితలు ' అన్నచో బాధ యుండదు, ఈ యూహతో నీనామకరణపు మార్పు జరిగినది.

ఇపు డీ మొదటిపాలున - నడుమనున్న - అనగా 19వ శతాబ్దికి జెందిన జనన తిథులుగల నూరుగురు రచయితలను గూర్చిన జీవిత కవితా సమీక్ష లున్నవి. లో జన్మించిన పరవస్తు చిన్నయసూరితో నీగ్రంథము మొదలగుటలో సూరి శతాబ్దారంభములోని వాడనుటయే కారణముగాక, నీతిచంద్రిక రచనచే గద్యవాజ్మయమునకు గ్రొత్తవెలుగునిచ్చి కొన్ని క్రొత్తదారులు తీసినవాడగుటయు గారణ మగుచున్నది. సాధారణముగా, కవుల పుట్టుకలనుబట్టికాక, గ్రంథ రచనలను బట్టియే చరిత్రములు సంధానించుట యాచారము. నేను అది పెట్టుకొనక, పుట్టుకలనుబట్టి యీ శతాబ్దిలోని వారని యేరుకొంటిని. జాగ్రత్తగా, చూచినచో మరియొక వందకాదు, కొన్నివందలమంది