పుట:AndhraRachaitaluVol1.djvu/6

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మహారచయితలు శతకమునకు సంబంధపడినవా రుందురు ; ఉన్నారు. వారి నెల్లరను దేర్చి చేర్చిన గాని యీ కూర్పునకు సమగ్రత సిద్ధించె నన గాదు. కాని, ఇప్పటి కిది నాసేవాలేశము. దైవాదేశ మయిననాడు, ఈ గ్రంథము సుపరిపుష్టము కావచ్చును.

ఇపు డిచట ఆరాధింపబడినవారు గాక, మరియెందరో మహనీయులు తలపున కందినవారి క్షమాభిక్ష నేను వేడవలసియున్నది. ఈ మహనీయులలో గొందరి జనన తిథ్యాదికము తెలియకపోవుట - కొందరి రచనలు నేనిందాక చదువుకొనుటకు ఈడు చాలకపోవుట - కొందరు జీవత్కవులు తమ్ము గూర్చి ప్రకటింపరాదని నాకు శాసించుట - కొందరి విషయమున, రచయితలుగా నందిన కీర్తికంటె, భాషాభివర్ధకులుగా సంపాదించిన యశస్సు హెచ్చుగా నున్నదని సదుద్దేశముతో నుపేక్షించుట - ఇత్యాదు లేవేవో కారణము లీగ్రంథము నింత పరిమితమును జేసివైచినవి. క్రింది రచయితలను, ఈ కూర్పుననే పూజించుకోలేని నా నీరసతకు, సిగ్గిల్లుచున్నాను.

కరాలపాటి రంగయ్య జూలూరి అప్పయ్య
శతఘంటము వేంకటరంగశాస్త్రి అక్కిరాజు ఉమాకాంతము
చదలువాడ సుందరరామశాస్త్రి మల్లాది విశ్వనాధశర్మ
ఆదిపూడి సోమనాథరావు రాయదుర్గము నరసయ్యశాస్త్రి
ఆదిపూడి ప్రభాకరరావు కేతవరపు వేంకటశాస్త్రి
తురగా వేంకమరాజు భండారు అచ్చమాంబ
అమరవాది రామకవి కాంచనపల్లి కనకమ్మ
భోగరాజు నారాయణమూర్తి త్రిపురనేని రామస్వామి చౌదరి
కొప్పరపు గవులు మానవల్లి రామకృష్ణకకవి
శేషాద్రి రమణ కవులు నాయని సుబ్బారావు
తాడేపల్లి వెంకటప్పయ్యశాస్త్రి అబ్బూరి రామకృష్ణారావు
కాశీనాధుని నాగేశ్వరరావు బలిజేపల్లి లక్ష్మీకాంతము
ముట్నూరి కృష్ణారావు తాపీ ధర్మారావు
ఉన్నవ లక్ష్మీనారాయణ

ఇటు లెన్నో పేరులు స్మరించవచ్చును. రాయలసీమ - నిజాము ప్రాంతీయులలో నెందరో విజ్ఞఉల విషయమున నేను అజ్ఞఉడను. వీరందరను కాలక్రమమున మనము ఒక కూర్పున సమావేశము చేయవలసి యున్నది.