స్రాలేయ గిరికందరా వినోదవిహార
వరులైన సిద్ధ దంపతు లనంగ
విబుధ తరంగిణీవీచికా డోలల
దూగెడి రాయంచదోయి యనగ
కవి మన:పంకజానవ సొక్తమై రసా
గ్రముల నాడెడీ ఫాదార్థము లనంగ
నానంద పరిపుల్ల మౌనీంద్ర దహర తా
రాధ్వమం దాడు జీవాత్ము లసగ
జీకుచింతల దిగ ద్రావి, చెన్నుమిగిలి
హృదయ సంవేద్య మయ్యు నాత్మైకగమ్య
మైన యద్వయ సౌఖ్య రసామృతమ్ము
ననుభవింతురు వారు నిరంతరముగ.
*
ఈ అభినవ కవుల కవ తొలుత మైత్రీబంధము తోను, పిదప బాంధనముతోను గలసి వచ్చినది. అనగా, కాటూరి కవి మేనకోడలు పింగళికవి బావమఱదికి భార్య. ఈ చుట్టఱికము సాహిత్య బంధుత్వము గట్టిదని నే ననను. ఇట్టివీరి కలయిక నవ్య కవితా లోకమునకు తొలకరి. అదే హేతువుగా వీరి తొలికృతికి దొలకరి యని పేరు వచ్చియుండ వచ్చును. ఇది కొన్ని ఖండ కావ్యముల రాశి. అవి యన్నియు భిన్న విభిన్న విషయకములు. ఈ ఖండ కావ్య రచనాఫక్కి వీరి నుండియే వచ్చెననగాదు. మఱికొందరును, దారు లేరుపఱిచిరి, వానిలో వీరిదియు నొకటి. పాశ్చాత్యసంపర్క లబ్ధమైన యీమేలి వెలుగు తెలుగునాట మిక్కిలిగా నేడు నెలకొన్నది. రసిక మానసాకర్షకమైన పదబంధము పింగళి కాటూరి కవుల కవితలో దొట్టతొలుత దొలకరించిన గుణము. అది మెల్లగా 'సౌందర నందము' నకు