పుట:AndhraRachaitaluVol1.djvu/498

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జేరుసరికి భావరస వర్షావారివాహ మైనది. 'తొలకరి' నాడు, కవితను గురించిన యీ జంట కవుల తలపు లిటులున్నవి:-

సీ. చూతురా, దీనిని జూతపల్లవ ఖాది

ని పిగాంకనా గాన నిన్వనంబు

కొందురా, దీనిని గ్రొమ్మెఱుంగుల జిల్గు

పనికి గాదగిన కుందనపు దళ్కు

కావలెనా, యిద్ది, కలువపూరేకు పొ

త్తముల జిప్పిలెడు మెత్తందనమ్ము

వలయునా, మలయ పర్వత సానువులనుండి

దిగుమతి యగు కమ్మ తెమ్మర లివి

తీయుదుర, దీని బచ్చ కప్పురపు దావి

కోరికొందుర, దీని బటీరజలము

త్రావిచూతుర, తీయని పూవుదేనె.

'తొలకరి' కి దొలిపలుకు వ్రాయుచు శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి చిట్టచివర నిట్టులని ముగించెను.

" ఈకవులు నిక్కముగా స్వతంత్రులు. ఆర్యాంగ్లేయాది వాజ్మయముల సారముల బీల్చి తమయందు లీనమగునట్లు చేసి దానిచే గలిగిన పుష్టిచే బుష్కలముగా వ్రాయువారు. వీరి కవిత్వమున నిక్కంపు మంచి సీలము లున్నవి. తళుకు బెళుకు ఱాళ్ళు లేవు. అయినను, రత్న పరీక్షయందు సమర్థులగువారికి గాని సామాన్యులకు వానిగుణము నెఱుంగ నలవికాదు. నుకవిభోగ్యము లిచటి వస్తువులు, నలిపివేయక డటు నిటు కలచివైచి-"

'సౌందరనంద' రచనతో వీరికి, సిద్ధహస్తులయిన మహాకవులుగా బరిగణనము వచ్చినది. ఆకావ్యమునకు దెలుగు దేశమున రావలసిన