పుట:AndhraRachaitaluVol1.djvu/496

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జంట కవుల హృదయము లంటుకొనియుండ లేదా! వట్టి - పేళ్ళు జతపఱచి నంతమాత్రమున గాదుచ కవితా స్నిగ్ధములయిన యెదలు శబ్ధార్థముల వలె విడదీయరానివి కావలయును; అదియే జీవాత్ములజంట వంటి జంట. నాకొక విషయము ముచ్చటగా నుండును. సౌందరనందాదులగు కొన్ని కావ్యములు పింగళి - కాటూరి కవులు కవగా వ్రాసిరి. కొన్ని యెవరి మట్టునకు వారు విడిగా వ్రాసికొనిరి. తత్త్వదృష్టికి నిదియొక యందమేయని నా యానందము. "ఒక్కరు రచియించిరేని యది కాదగు దిర్పతి వేంకటీయమై" అన్న జంటకవుల ప్రతిజ్ఞలోని పరమార్ధము హార్దము కావలయును గాని, కాపీరైటు తగువులాటలకు దిగునది కారాదు కదా! ప్రకృత కవులు గురువులు తిరుపతి వేంకటకవులు సర్వధా అభిన్నులెట్టులైరో, పింగళి కాటూరి కవులు నట్టివారని రుజువు చేయుదును. ఇందులకు సౌందరనందములోని - యీ పద్యములు నాకు ప్రధానమైన యాధారముగా గనిపించినవి.

మేలేర్చి నందుండు పూలు గోసి యొసంగ
నరము లందముగ సుందరి రచించు
మెలత వర్ణమ్ములు మేళవించి యిడంగ
హరువుమై నతడు చిత్తరువు వ్రాయు
బతి యపురూపభావము వచించిన నను
రూప పద్యమును గూర్చును లతాంగి
అతివ చక్కనిరాగ మాలపించిన వీణ
పలికించు నతడు మై పులకరింప

నెఱ్ఱసెరల నందుని చూపులింతి యాన
నేందునకు గెంపుల నివాళులెత్త, నతివ
కజ్జలవు జూడ్కి ప్రియుని వక్షఃవాటి
గట్టు దోరణములు నల్లకల్వపూల

60