Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/495

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పింగళి లక్ష్మీకాంతము

కాటూరి వేంకటేశ్వరరావు

1894

1895

ఇరువురు ఆరువేల నియోగులు. లక్ష్మీకాంతముగారు గౌతమసగోత్రులు. అభిజనము: కృష్ణాజిల్లా చల్లపల్లి తాలూకాలోని చిత్లూర్పు. నివాసము: విశాఖపట్టణము. తల్లి: కుటుంబమ్మ. తండ్రి: వేంకటరత్నము పంతులు. జననము: 10-1-1894 సం|| తేదీ.

వేంకటేశ్వరరావుగారు శ్రీవత్ససగోత్రులు. తండ్రి: వేంకటకృష్ణయ్య. పాలించిన తలిదంద్రులు: లక్ష్మమ్మ, కొండయ్య. జన్మస్థానము: కృష్ణామండలములోని కాటూరు. జననము: 15 అక్టోబరు 1895 సం|| రచనలు: 1. సౌందరనందము 2. పౌలస్త్యహృదయము 3. తొలకరి (ఈ మూడు కావ్యములు ఇరువురిపేర ప్రచురితములు) 1. బగ్ బౌరలు (ఆంగ్ల నవలకు ఆంధ్రీకరణము) 2. ప్రతిజ్ఞాయౌగంధరాయణము 3. స్వప్నవాసవదత్త (భాసనాటకములకు దెలుగుసేతలు) 4. నల్లగలువ (ఆంగ్లము నుండి తెనుగు-పయిని, ఒక వేంకటేశ్వరరావుగారి పేరనే ప్రకటితములు) 1. మధుర పండితరాజ్యము-ఇత్యాదులు లక్ష్మీకాంతముగారి సొంతము.

ఇటీవలి సంప్రదాయము ననుసరించి 'లక్ష్మీకాంత వేంకటేశ్వరకవులో - 'పింగళికాటూరి కవులో కావలసినవారు వీరు. అదీగాక, వీరు తిరుపతి వేంకటకవుల శిష్యులగుట కారణముగా, విధిగా జంటపేరు సంధించుకొనవలసి యున్నది. అటులు నేయక - స్వచ్చముగా నిరువురు వేఱు వేఱు పేరుల కృతుల ముఖవత్త్రములపై వేసికొనుట - వీరి గతాను గతికధర్మాసహిష్ణుతకు, పురాతన సంప్రదాయకృతశ్రద్దాగౌరవ దృష్టికిని గుఱుతులు. తెలుగున బ్రబోధచంద్రోదయ ప్రబంధ రచయితలగు