పుట:AndhraRachaitaluVol1.djvu/490

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

తెలిసినవారు; ఆంగలములోని మెలకువలు వినుపించుకొన్నవారు. పైగా, సంగీతకళలో నఖండమైన యెఱుక. నోటిపాట వీరిది తీయనై శ్రుతి పేయముగా నుండును. సంగీత - సాహిత్యములలో సరితూకముగల విన్నాణము శర్మగారిలోనే రాణించుచున్నది. ఈ సౌభాగ్యము చేకురినవా రనేకులు లేరు. అనంతకృష్ణశర్మగారి విమర్శన వైయాత్యమునకు వారి 'వేమన' సాక్షిగ్రంథము. తెలుగులో నిట్టి విమర్శన కృతు లీవఱకు లేవనుటయు సాహసము కాదు. " ఈ పద్యము హృద్యముగా నున్నది. ఈ భావము రమణీయముగా నున్నది." ఇత్యాది గతానుగతిక వైతాళికఘోష విమర్శన వేషముతో సంచారము చేయుట సహింపరానిది. మన విమర్శకుల దృక్పధమును మంచిదారులకు జేరబెట్టిన 'రాళ్ళపల్లి' వారి మేలు మఱవరానిది. నాచన సోమనాథుని కవితా తత్త్వమునకు వీరు గావించిన భాష్యము 'ఆంధ్ర సాహిత్య పరిషత్తు' వారి బహుమానమునకు బాత్రమైనది. ప్రక్కపాటులేని నిక్కపు విమర్శనము శర్మగారి చేతిలో నిగ్గులు దేఱి 'ఉత్తరహరివంశ' సమీక్షారూపమున బయటికి వచ్చినదని జయంతి రామయ్యపంతులు మున్నగువారు నాడు మెచ్చుకొనిరి. ఇంత దిట్టమైన విమర్శన శక్తికల మానిసికి రసవంతమైన కవితాప్రాభవమును జేతనుండుట యొక నుయోగము.

శర్మగారు రచించిన 'మీరాబాయి'-'తార'-ఈ రెండు కావ్యములు రెండు మధుకుల్యలు. ఆయన ప్రాకృతమునుండి తెనుగుపఱిచిన 'గాథాసప్తశతీసారము వాడని మల్లెపూలప్రోవు. శిరీషవేశలమైన తన తెనుగు పద బంధమునకుసరిపడిన కావ్యము నేరుకొనిరని నాకుముచ్చట. రచయిత యేరుకొన్న యితివృత్తములోనే, ఆతని హృదయ మత్తుకొని యుండును. 'సప్తశతి^ లోని మృదు ముగ్ధమైన జాను తెనుగుదనము, ఇదిగో!

పసపు నీళ్ళాడి దువ్వెన పండ్ల నడుమ

జిక్కుకొనియున్న మైలను జిన్నముల్లు