పుట:AndhraRachaitaluVol1.djvu/489

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ

1893

శ్రీవైష్ణవ బ్రాహ్మణులు. శఠమర్షణగోత్రులు. పెంచుకొన్న తండ్రి: అనంతాచార్యులు. అభిజనము: రాళ్ళపల్లి (అనంతపుర మండలము కల్యాణ దుర్గము తాలూకాలోనిది) కన్నతండ్రి: శ్రీవత్ససగోత్రులు కర్నమడపల కృష్ణమాచార్యులు. కన్నతల్లి: అలవేలమ్మ. జననము. 23 జనవరి 1893 సం. నందన సంవత్సర మాఖ శుక్ల షష్టి. ప్రకృత నివాసము: మైసూరు. రచనలు: 1. తారాదేవి 2. మీరాబాయి (పద్యకావ్యములు) 3. లీల (వచనము-కల్పితగాథ) 4. వేమన 5. సారస్వతోపన్యాసములు 6. నాటకోపన్యాసములు 7. శాలివాహనగాథా సప్తశతి (400 పద్యములు-ఆంధ్రీకరణము) 8. స్పర్ధాకావ్యము (సంస్కృతము) 9. మహీశూరరాజ్యాభ్యుదయాదర్శము 10. రఘువంశ భాషాంతరీకరనము (చివరివి రెండును ముద్రితములు కాలేదు).

మాధురీ మార్దనములకు దావలమైన వచనరచన యెవనిసొమ్మనగా, అది రాయలసీమలో నుదయించి మైసూరున నివసించువారదని వెంటనే వచ్చు సమాధానము. రసభాసములకు నిదానమైన పద్యరచన యెవనిసొత్తనగా, ప్రత్యుత్తరము వెనువెంటనే రాలేదు. నేటి తెలుగునాట, పద్యరచయితలు పెక్కురనియు, గద్యరచయితలు తక్కువ యనియు దీని పరమార్థము. సర్వాంధ్రము మొత్తమున, వచనరచనా విశారదుడు ఒక్కడే యనుట యతిశయోక్తికి జేరుమాట. ఇట్టి చిక్కులు రాకుండు పరిష్కార ముండనేయున్నది. అది "అనంతకృష్ణశర్మగారు నేటి ప్రముఖ వచనరచయితలు నలువురైదుగురిలో నొక్క" రనుట. శర్మగారు మంచి వచనము వ్రాయుదురు. వీరి పద్యరచనయు బహుమనోహరము. ఈకూర్పు నేర్పులకు వారికి గల కోవిదత్వము దోహద మిచ్చుచున్నది. సంస్కృతాంధ్రములలో వారు చేసినది. గీటుఱాతికి వచ్చు మేలి బంగరుపు వంటి కృషి; ప్రాకృత సారస్వతపు లోతులు