పుట:AndhraRachaitaluVol1.djvu/465

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కనుంగొనంగ రాక పోక గంద్రగోళమయ్యె; నా

మనంబు, నేను, లేమ - యేమొ మాయమయ్యె నయ్యెడన్.

         *

మూర్ఛయేమొ లోన మూల్గు వినంబడె

నునుఱు గల దొకింత మసలినాడ

తోచె నొడలిలో నెదో చేతన - యెటో గ్ర

హింప నాస్వభావ మింపు లొలికె

        *

దానిగుర్తు పట్టి యానంద మందితి

నట్టె దాని నంటి పట్టి కొంటి

ప్రజ్ఞ వెలసె గన్ను పఱపితి; నది లోనె

లోనె కాంచు వెలికి రానె రాదు.

ప్రభాకరశాస్త్రిగారి తాత్త్వికదృష్టి యీ పద్యములలో సుస్పష్టపడుచున్నది. కవితాపారమ్యమును గుఱిచి వారి సందేశము మనము మననము చేసికోవలసియున్నది.


"..తాత్త్వికునిలో కవితాంశములును, కవిలో తాత్త్వికతాంశములును గూడ ననుగతములై యుండవచ్చును......తాత్త్వికుల తత్త్వజ్ఞానము పెరుగగా, తన్మూలమున కవితలో తాత్త్వికతాంశములు పెరుగగా పెరుగగా సంఘమున తాత్త్వికతాశ్రద్ధ పెచ్చు పెరుగును. అప్పుడు కవిత తేట దేరి క్రమపరిణామముతో బరమార్థపరాయణ మగును. కృతిమ కవితావిడంబనముల కపుడు తా వుండదు. కవి కపుడు సత్యప్రతికృతి కల్పన మనావశ్యక మగును. సౌందర్య సముచిత మయిన యా పరమార్థమే, అనగా సత్యమే యప్పుడు వాజ్మయాకృతి దాల్చును. పదునాఱువన్నె బంగారమును మించిన మేనిసౌరుగల శుద్ధసాత్త్విక తేజో విరాజితునకు బంగారపు టలంకారములతో బనియేమి?........."