పుట:AndhraRachaitaluVol1.djvu/454

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

" మాతండ్రి గారు ప్రచురించిన గ్రంథములు రెండు. భారతసార రత్నావళి, భాగవతసారముక్తావళి. సొంతకవనము పొంత బో గూడదను నియమము దాల్చినవా రగుటవలన, నీ సంపుటీకరణములతో దృప్తి జెందిరి."

                                *

"ఆంధ్రలోక గురువులలో వేమన మొదటివాడందుమేని, సుమతి రెండవ వాడు......మావంశమున కేదివచ్చిన రానిండు. తెలుగుభాష యొక్కటిమాత్ర మక్షయముగ నిలిచియుండిన జాలును."

                                *

రెడ్డిగారు 'వ్యాసమంజిరి' యైదుఖండములుగా వింగడింపబడి యున్నది. పూర్వఖండము, అభిజనఖండము, భాషాఖండము, ఆధునిక కవితాఖండము, సాంఘికఖండము నని - ఈరచన లన్నింట నొక్కొక్క క్రొత్తతెన్ను కనబడును. విషయము సూటిగా మొగమోటమి విడిచి వ్రాయుటలో రెడ్డిగారిదొక ప్రత్యేకత. ఆయన మాటలో వలె వ్రాతలో సున్నితమైన ధ్వనిమర్యాద యుండును; హాస్య రేఖలు నుండును. వచనపు నడక చాలదొడ్డది రెడ్డిగారి కలవడినది. పరిశుద్ధమైన లక్షణావిరుద్ధభాషలోనే వీరి రచనలెల్ల సాగినవి.


వీరి వ్యాసమంజరికి ఉపోద్ఘాతము వ్రాయుచు పింగళి లక్ష్మీకాంతముగారు: "విమర్శకులలో వీరికెంత ప్రాధాన్యమున్నదో వ్యాస రచయితలలోను అంతప్రాధాన్యమున్నది. సాహిత్యాంగముగా బరిగణింపదగిన వ్యాసరచన ఆంగ్లభాషలోవలె మనభాషలో ఇంకను పరిణతావస్థకు రాకున్నను, జరిగినంతవఱకు దానిపెంపునకు గారణభూతులైన విద్వాంసులలో వీరొకరు. గ్రంథములకు బీఠికలు వ్రాసినను పత్త్రికలకు వ్యాసములు వ్రాసినను, తాత్త్వికముగా విషయచాలన మొనర్చి పటుత్వముగల భాషలో సోవపత్తికమైన సిద్ధాంతము చేయు నేర్పు వీరి