పుట:AndhraRachaitaluVol1.djvu/444

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రచయితల నుండి కొన్నిపద్యములేఱి పాథకుల ముచ్చటకై యిచ్చుట యీ రచనలోని యాచారము. ప్రసంగములో సత్యనారాయణగారి పద్యములు మున్నేకొన్ని యెన్నితిని. వారి ప్రత్యక్షరము నెన్నఁదగ్గదే యైనను 'రామాయణ కల్పవృక్షము' నొక కొమ్మ దులిపి కొన్ని పూలు రాలిచెదను.


     క. పరసుఖ దశా పరీపా
          క రామణీయక మెఱుంగుఁ గచసాన్నిథ్యా
          త్తరమణఁ బ్రథమ స్పర్శ
          ప్రరూఢి మెడవొలిచె సూత్రబంధనవేళన్.


     గీ. కరరుహంబులు చర్మంబు గాకపోయె
          నవియుఁ బులకించునేమొ ప్రియగళాత్త
          మైన స్పర్శసుఖా ప్తిఁ బ్రియాగళంబు
          నంటి బాధించు వీని కేలా ! సుఖంబు.


     క. తలఁ బ్రాల వేళఁ బడచును
          నలఘుచ్ఛవి నెగురు ముత్తియంబుల మిషచే
          నలుకేళకుళులు వొలిచెను
          నలుగురు దంపతులు మోహన స్తంభములై.


     గీ. నాలుగవ పాలుగా నింద్రనీలమణులు
          మణులు కలియంగఁ బోసిరో యనఁగ బొలిచె
          ముత్తెములు చతుర్దంపతి ముగ్ధతను స
          మా త్తనీల రక్తచ్ఛవుల్ హత్తుకొనఁగ.


     గీ. అలుపములు రెండు మూఁడు ముత్యాలు నిలిచి
          సీత పాపటలోఁ జిఱు చెమట పోసె
          హత్తుకొని గంధపూఁత ముత్యాలు రెండు
          రామచంద్రుని మేనఁ దారకలు పొలిచె.