కాదు. సత్యనారాయణగారి 'అహం' కారము కేవల కవితాపరము, లౌకికము నగు నర్థము కలదికాదు. ఆయన సత్యమైన 'అహం' పదార్థ జిజ్ఞాసకల వ్యక్తి. రామాయణ కల్పవృక్షము బాలకాండాంతమున నిట్లు విశ్వేశ్వర ప్రార్థనము చేసినారు.
అమరీ కైశిక పారిజాత కుసుమోహస్వాదు వీబాలకాం
డము నీ భక్తుఁడు శోభనాద్రి దగు సంతానంబు జన్మాద్యపా
యము తప్పించుత ! యెన్ని పుట్టువుల పెట్టైతిన్ శివా ! యేమికా
మము? కోపం బదియేమి ? యేమియగునీ మాత్సర్యమోహో, ప్రభూ !
ఇది మెచ్చెదరో మెచ్చరొ
యిదియును జదివెదరు చదువరేలా నాక
య్యది ? నాయెద మీతో రా
చెద నద్దానికి ఫలంబుఁ జెందించు శివా !
హాళిఁ జరించుఁ గావ్యరచనాత్త యశఃకృత నాకసౌఖ్య వాం
ఛా లులితంపుటాత్మయె పొసంగదు నాదెసఁ బొందుగాక ము
క్త్యాలధరాధినాయకుఁ డదంతయు; నాతపమెల్లఁ బండి యు
ద్వేలజనూరుజావితతి విచ్చెడినట్టు లనుగ్రహింపవే !
ఈవిధమైన కోరికతో 'విశ్వనాథ' కవి రామాయణము రచించుచుండె ననఁగా నది వట్టి కావ్యమాత్రము కాదు, రసాఖండమైన మహాకావ్యమునుగాదు, ఆధ్యాత్మిక తత్త్వమునకు మహాభాష్య రచనయే కాఁగలదు. "కృతిచే సమాత్తమగుఁ గీరితి స్వర్గ, ద మంతె; నేవరింపను స్వర్గం బతిరూక్ష చింతనాగ్రస్థిత తేజము శివు@డు నన్నుఁ జెందెదుఁ గాతన్!" అన్నవాంఛ యుత్తమ జాతి మహాకవికిఁ గాని పొదమదు. "అనృషి కావ్యము రచింపలేఁ" డను మాటవరుసకు నిట్టి సందర్భములో నెంతో వ్యాఖ్య చేయవలసి యున్నది ! ఇపుడు వలదు, అందరు