పుట:AndhraRachaitaluVol1.djvu/436

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్ర భాషోద్ధారకులలో "కాశీనాధునివా" రెట్టివారో., ఆంధ్ర భాషా కవులలో విశ్వనాధవా రట్టివారు. నాగేశ్వరరావుగా రాంధ్ర సాహిత్య పరిషత్తును గౌరవించిరి; నవ్యసాహిత్యపరిషత్తు బహూకరించిరి; కాంగ్రెసుతోఁ గేలు గలిపిరి; మఱియొక పక్షమును మర్యాద చేసిరి. మంచియే వారి కుపాద్యము. 'విశ్వనాధ కవికిని సనాతనాధునాతన కవితలయందు సమభావమే. కాశీనాధునివారు శైవమావలంబకులు, విశ్వనాధ వారి 'త్రిశూలము' దానికిఁ దార్కాణము.


కవి వివిధవిషయ నివిష్టబుద్ధి కావలయును. అట్టివారు నేఁటికవులలో లెక్కకు మాత్రమే కలరు. వారిలో సత్యనారాయణ గా రొక్కరు. నేఁడు ప్రాచీనకవితలను 'హుష్' అనువారు కొందఱును, నవీన కవిత్వమును 'అబ్బే' యనువారు కొందఱును. వారికి రసాస్వాదకులలో గణన యుండదు. సారన్య మెచట నున్నదో యరసి దాని నాస్వాదించుట రసికధర్మము. పూర్వ - నవ్య విచారణముతో నతనికిఁ బనియుండరాదు.


పద్యము వ్రాయు కవి గద్యము వ్రాయలేకపోవచ్చును. గద్యము రచించు కవికిఁ బద్యము సాగకపోవచ్చును. నాటకకర్త విమర్శనశక్తి కలవాఁడు కాకపోవచ్చును. సర్వతోముఖ సమర్థత కలవాఁడు దీక్షతో గ్రంథములు వ్రాసి లోకమున కందీయఁ జాలక పోవచ్చును. ఇవన్నియుఁ బట్టినవాఁడు సమగ్ర కళాప్రపూర్ణుఁడైన జాబిల్లి వంటివాఁడు. సత్యనారాయణగారు నవలారచయితలలో నేఁడు మంచిపేరు సంపాదించుకొన్నారు. ఆయన 'వేయి పడగలు' మెచ్చుకొని ఆంధ్ర విశ్వవిద్యాలయము వసదన మిచ్చినది. విశ్వవిద్యాలయముమెప్పు మనకక్కఱలేదు. అది యొక 'నవల' మాత్రము కాదు. ఆంధ్ర విజ్ఞానసర్వస్వమునకు మాఱుపేరుగా వెలసిన గ్రంథము. దానిలో సత్యనారాయణగారి సారస్వత-సాంఘిక సిద్ధాంతము లన్నియుఁ గరడుగట్టి యున్నవి. గొప్ప యెత్తుగదతోఁ గడదాక