పుట:AndhraRachaitaluVol1.djvu/430

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చలాకీగాని, పౌరుషంగాని వెతికితే కానరావు. వేషంలో మోటుతనము గాని యుక్తతయేమీ లేదు."


ఇది ఇటుండగా, 1895 సం.లో అప్పారావుగారు చమత్కారమునకు వ్రాసికొన్న కొన్ని 'డైరీ' లోనివిషయములు శ్రీ శేషగిరిరావుగారు వెలువరించినవే మనయుపయోగార్ధము చూపించెదను. నిజమునకు, వారిచరిత్రమునుగూర్చి తెలిసీ తెలియని సంగతులుపేర్కొనుట కన్న, వారివ్రాతలే యిచట నుదాహరించుట వినోదముగానుండును.


" 19.4.'95' పదిహేనోతేదీని ఒకసంగతి జరిగినది. తలుచుకుంటే నవ్వు వస్తున్నది. పచ్చయప్పకాలేజీలో మీటింగుకు వెళ్ళి యింకా కొంత వ్యవధి ఉంటే " యీవినింగు బజారులో తచ్చాడుతూ ఉంటిని. ఒక పుస్తకాల స్టాలువద్ద వుండగా ఒక బికారివాడివంటివాడు వచ్చి ఆ అంగడివాని కొక కళ్ళజోడు అమ్మజూపినాడు. అతడు రు. 1 - 6 - 0 యిస్తానంటే వాడు రు.3/-యిమ్మనాడు. నేను రు. 1 - 8 - 0 ఇస్తా నంటిని. వాడు కొంచెం గొణుగుకొని యిచ్చి వేసినాడు. అది వెంటనే కళ్ళకు పెట్టుకొని చూస్తిని: సరిపడలేదు. ఎట్లు సరిపడును? నా కప్పటికి చత్వారములేదు. హ్రస్వదృష్టి లేదు. బూట్సూ, స్పెక్టెకిల్సుతో యేదో లేనిఘనత వచ్చినట్టు మహాదర్జాగా అవి కళ్ళకు వుంచుకొని కాలేజిలోకి వెళ్ళబోయినాను. కాని ఆ కళ్ళజోడులో దూరపుచూపున కొక ముక్కా, చదవడమున కొక ముక్కా అతికివుండడముచేత దృష్టి చెదిరి మెట్ల మీదనే ద్వారములోనే జారి చాలా హాస్యాస్పదముగా చతికిల బడిపోయినాను!"


"ముఖమునకు కనుబొమలు కొంత అందం యిస్తవి. పొటకరించుకొని బొద్దుగా ఉండేవి బాగుండవు. చర్మమునకు అంటుకొని పోయినట్లుంటే క్రూరత్వమును సూచిస్తవి. అతి సున్నితముగా పెన్సిల్‌గీత వలె వుంటే చులకన మనిషి అని సూచన. క్రమముగా విల్లువలె వంగి