పుట:AndhraRachaitaluVol1.djvu/429

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

" వచనం సరసంగా, సహజంగా, యాసలేకుండా పాత్రోచితంగా చెప్పడము వీళ్లెవళ్లకి తెలియదు. గబగబా స్కూలు పిల్లలు పరీక్షాధికారి యెదుట యేకరువు పెట్టిన ట్లంటారు. పందెంపెట్టి యెవరు ముందు ముగించుతారా అన్నట్లు చెబతారు. నిలుపులు సక్రమంగాఉండవు. యాసగా ఉంటవి. మదరాసీలకు దీర్ఘోపన్యాసాలూ, పాటలు తప్ప మరియేవీ మది కెక్కవు. కేవలం వచన నాటక మంటే వీ రా స్మరంతికే పోరేమో!" "నాటకపుజట్టులోనికి పడుపు కన్యలను చేర్చుట చాలా ప్రమాదకరమని నావూహ. అందకత్తెయై తెలివైన నటి పడుపుకన్యయైతే సంఘమునకు చాలా ముప్పు తేగలదు. ఆమెకు ఎన్నికైన సౌందర్యం లావణ్యం నాగరికతా వుంటే కలుగ గల అల్లర్లకు మేర వుండదు."


" బాలామణి జట్టులో దుష్యంతుడుగా బాలామణిచెల్లెలు వచ్చింది. రూపము వికారంగా ఉంది. నడక రంగేలాతనంగా ఉంది. కంఠం విప్పితే ఆడది అని తెలిసిపోతూ వుంది. బాలామణి తప్ప ఆ జట్టులో చెప్ప తగ్గ మరివొక మనిషి కనబడలేదు. కల్యాణరామయ్య జట్టులో దుష్యంతుణ్ణికూడా చూస్తిని. ఆతని వేషం మరీపాడుగా వుండెను. అట్టి మనిషి కావేషం ఎందుకు వేసిరా అనిపించినది. అతడే వాళ్లలో 'హీరో' కాబోలు. నల్లగా లేడు కాని అందమైనవాడు కాడు. వేషం మీద రూపం అందంగా కనబడేటట్టు చేసుకోవడం కూడా ఎరిగినట్టు తోచదు. సాక్సు, నల్ల ట్రౌజరు, కోటూ వేసుకొని మిలటరీ ఆఫీసరులాగ దిగబడ్డాడు. తలమీద టోపీ కూడాను. చిన్నపలుచని మీసకట్టూ, నుదుట తిరుచూర్ణమూ-మావేపు సాతానిభిక్షువుని జ్ఞాపకమునకు తెచ్చినది. మూతి కొంచెం ముందు కుంటుంది. మీదిపెదవి గుండ్రము; పెదవులలో ఇముడని పొడుగుపళ్లు-ఇట్టి మఖములో లావణ్యము గాని చురుకుతనముగాని యేలాగు కనబడవు ! ఈతనిలో ధీమాగానీ,