పుట:AndhraRachaitaluVol1.djvu/431

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాధారణపు దళసరి కలిగి కండ్లకు అతి దూరముగాగాని, అతిదగ్గరగాగాని కాకుండావుంటే అదీ ముఖమున కందమిస్తుంది. ఏక వరుసగా లయినుగా కాకుండా యెగుడుదిగుడుగా వుంటే తెలివితేటలను సూచించును."


" 14 తేదీ మెయి: క్రిస్టియనుకాలేజీలో కెల్లెటుగారిని చూస్తిని. ఒకగంట సేపు చాలసంగతులు మాట్లాడితిమి. * * * పోలికలూ భేదములూ నిరూపించుతూ గ్రీసు రోము రాజ్యముల చరిత్ర నన్ను వ్రాయమని వారు ప్రోత్సహించిరి. అది నాశక్తికి మించినపని అంటిని-'కాదు - మీరువ్రాయగలవారు' అనిరి."


అప్పారావుపంతులుగా రీ తీరుగా నెన్నో సూక్ష్మాతిసూక్ష్మ విషయములు హృదయమునకు బట్టించుకొని, మానసికతత్త్వములు గుర్తించు కొని 'డైరీ' లలో దాచుకొన్నారు. విజయనగరము కళాశాలలో బెక్కునాళ్ళు ఉపన్యాసకులుగా నుద్యోగించి, విజయనగరప్రభువు ఆనంద గజపతి మహారాజున కాంతరిక మిత్రుడై యీయన రాజయోగముతో మెలగెను.


1895 సం. ప్రాంతములో పంతులుగారు మహారాజు సొంతపనులను నిర్వహించుటకును, ఔషధసేవ చేయుటకు మదరాసులో మకాము చేయవలసి వచ్చినది. ఆసమయమున వీరు క్రిస్టియను కాలేజి, ప్రెసిడెన్సీ కాలేజి, పచ్చయప్పకాలేజి, బెంగుళూరుకాలేజి-యివన్నియు జూచి యక్కడి ప్రొఫెసరులతో పాఠప్రవచనములను గూర్చి, విద్యావిధానములను గూర్చి చర్చలు సలిపి వచ్చిరట. వీరి సేవ విజయనగర కళాశాలాయశస్సునకు దివ్యసౌరభము.


ఎంతచులకనైన విషయమైనను లోతుగుండెతో విమర్శింపగల అప్పారావు పంతులుగారు 'కన్యాశుల్కము' నట్లు వ్రాసెననగా నబ్బురము కాదు. మానవసంఘములోని క్రుళ్లు కడిగి దేశమున కొక పవిత్ర సందేశము నందీయవలెనని యాయన యూహించెను. 'గిరీశము'