పుట:AndhraRachaitaluVol1.djvu/426

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

గురుజాడ వేంకట అప్పారావు

1865 - 1915


నియోగిశాఖీయులు. నివాసము: విజయనగరము. రచనలు: 1. కన్యాశుల్కము 2. కొండు భట్టీయము 3. బిల్హణీయము 4. ముత్యాలసరములు - చిన్నకథ 5. నీలగిరి పాటలు 6. సుభద్రా పరిణయము (ఆముద్రిత ప్రబంధము) మున్నగునవి.


అప్పారావుగారిని 'గురుజాడవాల్మీకి' యనికూడ వ్యవహరింతురు. వాస్తవమున కాయన నివీనాంధ్ర వాజ్మయమునకు వాల్మీకివలె నాదికావ్యము రచించి పోయినాడు. ఆ యాదికావ్యము కన్యాశుల్కము. అది దృశ్యకావ్యమే యైనను 'శ్రీమద్రామాయణము' వలె నేడు పారాయణగ్రంథమై యున్నది. 'ముత్యాలసరములు' తీసికొని వచ్చిన వారప్పారావుగారు. ఆదికవి నోటినుండి "మానిషాదప్రతిష్ఠాం త్వ" మ్మనుఛంద స్సప్రయత్నముగా వెలువడినటులు గురుజాడ కవినుండి యపూర్వవృత్తములు వెలువడి లోకమును గదలించినవి. ఆ యీ కారణములు చూచుకొని యప్పారావుగారిని 'వాల్మీకి' యని యుందురు.


1914 సం.లో బ్రభుత్వము సంస్కృత భాష యొక్కయు దత్సంబంధులైన యితరభాషల యొక్కయు బరిశోధనమున కొక పండితపదవి నియమించినది. ఆపదవికి మనదేశమునుండి దరఖాస్తులు వెళ్ళినవి. దరఖాస్తు పెట్టినవారిలో నెవ్వరు సమర్థులు వారికి గనబడలేదట. వయోనియమమును బట్టి గిడుగు రామమూర్తి పంతులుగా రా స్థానమునకు బోవ వీలుపడలేదు. మఱి, తెలుగువారి కేరికిని తత్పదవి దొరకలేదు. ఏయఱవయో, ఏకన్నడియో యాస్థానము నలంకరించి యాంధ్రభాషాతత్త్వమును బరిశోధించుటకు సిద్దపడును.సిద్ధపడుటయేకాదు, తెలుగు భాష దేశభాషలలో నక్కఱ