పుట:AndhraRachaitaluVol1.djvu/427

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాలినదిగా నతడు సిద్ధాంతము చేయును. ఈవిషయమున అప్పారావు పంతులుగా రెంతో సంతాపపడి తెలుగుచదువరి కొఱకు బహుయత్నములు చేసిరి. కడకు, బధిర శంఖారావము!


శ్రీ గిడుగు రామమూర్తి పంతులుగారికి వ్యావహారిక వాదమున గుడిబుజముగా బనిచేసిన వ్యక్తి అప్పారావుగారు. రామమూర్తిగారు లక్షణము - అప్పారావుగారు లక్ష్యము. వీరి కన్యాశుల్కము, ముత్యాలసరములు రామమూర్తి పంతులుగారికి నాడు వాదాధారములైనవి. గురుజాడ కవి పిండలి కట్టిన రసజీవనమే కన్యాశుల్కము. వీరివలన 'గిరీశము' శాశ్వతుడాయెను. గిరీశము మాటలు తెలుగునాట జాతీయములుగా బాదుకొనెను. అప్పారావుగారికి వేఱే పేరు లేదు, 'గిరీశమే' ఆయనపేరు. సమాజజీవనమున కింత దగ్గఱగానుండి, గుండియలకు బట్టుకొను వీరిరచన వేఱొకరికి లభించుట సంభవము కాదు. కన్యాశుల్కమునకు బూర్వము సాధారణముగా 'కంపెనీకవులు' నాటకములు రచించుచుండువారు. ప్రాచ్య పాశ్చాత్య సంప్రదాయముల నెఱిగిన అప్పారావుగారివంటి వారు నాటకరచనకు బూనుకొనుట సంఘమునకు మంచిమేలిచ్చినది. కేవలము సంఘసేవయే యీరచనలో గలయుద్దేశము. ఇదిక్రమముగా సారస్వత పరిణామమునకు గూడ దారితీయించినది. గిరీశము పలుకుబళ్ళు పెక్కులు తెలుగువారిలో నామ్నాయములుగా నుండుటకు అప్పారావుగారి కలములోగల నైసర్గిక ప్రతిభ హేతువు. ఇదికాక కొండుభట్టీయము, బిల్హణీయము ననురచనలు వీరివి మఱిరెండున్నవట. విజయనగరము మహారాజ్ఞని నవ్వించుటకు 'కొండుభట్టీయము' రచించుచుండెడివారని చెప్పుదురు. ఏలికయగు నారాణి యీరూపకములో నాయాఘట్టముకు చిన్నపుడు మహానందము పొందు చుండెడిదట. 'బిల్హణీయము' కొంతభాగము ప్రచురితమైనది. శృంగార ప్రధానమైన యితివృత్తము తీసి