పుట:AndhraRachaitaluVol1.djvu/419

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కోటగిరి వేంకట కృష్ణారావు

1890


పద్మనాయక వంశీయుడు. గంపలగూడెము జమీందారు. కన్నతల్లి: సుబ్బయ్యమ్మారావు. దత్తతగొన్న తల్లి: సుబ్బయ్యమ్మారావు. కన్నతండ్రి: చిన్నయ్యారావు. దత్తతగొన్న తండ్రి: జగన్నాధరాయిణింగారు. జన్మస్థానము: నూజివీడు. జననము: 1890 సం. ఖర సంవత్సర ఫాల్గున బహుళ ప్రథమ. గ్రంథములు: 1. శృంగార తిలకము (ఆంధ్రీకృతి 1915 ముద్రి) 2. యౌవనగర్హణము 3. చాటుపద్యములు 4. శ్రీకృష్ణరాయ నాటకావళి (అభినవ పాండవీయము-పాదుషా పరాభవము - బెబ్బులి-ప్రణయాదార్శము అను నాలుగు నాటకముల సంపుటము) 5. మాతృదేశము 6. విధి (పద్యకావ్యము) 7. దేవదాసి (నాటకము) 8. ఘోషావ్యాస ఖండనము (ఆముద్రితము).


జననం బందితి గీర్తికెక్కిన సువంశంబందు ; రవ్వంత స
జ్జన సాంగత్యము చేతనే తెలుగు బాసన్ జ్ఞాన మొక్కింత గ
ల్గెను ; నన్నింకకు స్తైరిణీరమణి పాల్సేయంగ బోకమ్మ, యౌ
వనమీ ! సాహస మింత కూడదు సుమా, బాగోగు లూహింపుమా.


ఈపద్యము ' యౌవననిగర్హణ ' మను చిన్నపుస్తకము లోనిది.


సీ. కైత యందున బ్రొద్దు గడపెద నందునా
          భావనాశక్తి నీపైకి మరలు
వ్యాయామ మొనరింపవలె నను కొందునా,
          యడుగులు నీ యున్కియందె చేరు
గ్రంథావలోకన కార్యంబు దలతునా
          చిత్తమ్ము నీయందు హత్తియుండు
హితదర్శనా యత్తహృదయుండ నైతినా
          నీ రూపమె యెదుట నిలచియుండు