పుట:AndhraRachaitaluVol1.djvu/400

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

భరితమగు చరిత్రముతో స్వప్నానసూయ రచింపబడినది. కృతిభర్త రామమూర్తికవికడకు వచ్చి సమ్మదాశ్రు పూరిత నయనయుగళుడై


ప్రతినదరమణీయము రం

జిత కమనీయార్థ గుణవిశేషము భవ ద

ద్భుత కవితాగుంఫన మో

కృతమతి ! నీ వెట్టి పరమ కృతకృత్యుడవో!


అనిప్రార్థించి యీ కావ్యము తన ధర్మపత్ని పేర వ్రాయ గోరును. నిర్దుష్టము, భావరసపరిపుష్టము నగు నందలి కవితాసృష్టి యిటులుండును. ఇవి సీతాపాతివ్రత్యప్రభావ వర్ణనములోని పద్యములు.


సీ. అడ్డులే కొకపల్కు నాడింపలేదయ్యె

బ్రాజ్యదై తేయ సామ్రాజ్యలక్ష్మీ

కనుగొననైన గన్గొన జేయలేదయ్యె

భువనరమ్య కుబేర పుష్పకంబు

మాఱుమొగంబేని మరలింపలేదయ్యె

గంభీర దశకంఠ గౌరవంబు

ఒకపాటి తలనైన నూపింపలేదయ్యె

నతి రౌద్రతర చంద్రహాసధార

యద్దిరా! నిర్భర ప్రణయ ప్రపుల్ల

రామచంద్ర పదాంభోజ రాగ భరిత

చరిత యగు సీత సౌశీల్య సద్గుణ ప్ర

తాప మహిత పతివ్రతాత్వ ప్రశస్తి.

     *       *        *

సీ. ఒనర నాగేటిచాలున నయోనిజ యయి

పొడమె నీబోటి యన్ బుద్ధిగాదు

జనక నామక మహా చక్రవర్తి కుమారి

యనియెడు గౌరవంబునను గాదు