Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/399

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లో రామమూర్తి గుణసం

భారము వాక్రుచ్చె నొక్క మత్తేభమునన్.


వ. అది యెట్లంటేని -


మ. కవిత న్నైపుణిగాంచి చక్క జతురంగంబాడగా మించి, గా

న విధిం బద్యములం బఠింపదగు విన్నాణంబు నార్జించి వం

శ వశంబై యెడ బాయకున్న దగు భైషజ్యంబునం జక్రవ

ర్తివినై యొప్పితి రామమూర్తి ! శమితార్తీ ! కీర్తికి న్మూర్తివై.


ఉ. ఈవును గృష్ణమూర్తియును నేకముగా నొకచో బఠించుచున్

భావము కబ్బ మొక్కగతి భాసిలు మిత్రులు మీర లిర్వురున్

గావున నిచ్చవచ్చు నొకస్కంధముజూచి తెలుంగు సేయుడీ

దేవీచరిత్ర మందు భవదీయ గుణొన్నతి వెల్లడిల్లెడున్.


అని వేంకటశాస్త్రిగా రనురాగముతో నీ రామకృష్ణులకు నవమస్కంధము నాంధ్రీకరింప నిచ్చిరి. ఆ కవులకు మెచ్చు వచ్చునటులు వీరాస్కంధము తెనిగించిరి. " ఇ కృతివరంబు, తెలుగుసేయుచు రామమూర్తియును నేను రామకృష్ణులమైనవారము కలయిక" అని స్కంధాదిని వీరు వ్రాసికొన్నటుగా నీ కృతి రచనమునందు మాత్రమే యీ కవ యిటులు కూడినది. దీనికి ముందుగాని, వెనుకగాని, వీరుజతగా విరచించిన గ్రంథము లేదు. ప్రత్యేకముగా, కృష్ణకవి 'కీచకవధ' యనునాటకమును రచించెను. రామమూర్తి 'స్వప్నానసూయ' కావ్యము సంతరించెను.


1929 లో సహపాఠి స్వర్గస్థుడైన తరువాతనే రామమూర్తిగారు స్వప్నానసూయ రచన 1936 లో గావించెను. పాలకొల్లువాస్తవ్యుడు శ్రీకృష్ణ భారతకృతిభర్తయు [కర్ణ-శల్య-సౌప్తిక-స్త్రీ పర్వములు] నగు చుండూరి నారాయణరా వను వైశ్యవరుని కోరికపై పతివ్రతాధర్మ