Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/398

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పెద్ద సంసారమునకు జాలినంతయున్నవారు. శ్రీ ఉప్పులూరి రామజోగన గురుముఖమున సంస్కృతాంధ్రములు చదువుకొని నిసర్గజమైన కవిత్వ ధోరణిని బెంపు చేసికొనిరి.

తిరుపతి వేంకట కవులతో రామమూర్తి శాస్త్రిగారికి మంచి మైత్రి. విశేషించి, వేంకట శాస్త్రిగారితో బాంధవము. చెళ్ళపిళ్ళకవి రామమూర్తిశాస్త్రి కడనే తఱచు ఔషధసేవ చేయుచుండుట యలవాటు. 1902 లో వేంకటకవి కనారోగ్య మేర్పడి పోలవరము వెళ్ళి మందు సేవించుచు రెన్నెలలు నిలువయుండెను. శాస్త్రిగారి 'జాతకచర్య' యీవిషయమును దారకాణించుచున్నది. అప్పుడు తిరుపతివేంకటకవుల దేవీభాగవత రచన సాగుచున్న సమయము. నవమస్కంధ్రీకరణము పీఠికలోని యీపద్యము లీ పూర్వోత్తర సందర్భమును బూసగ్రుచ్చినట్లు ముచ్చటించుచున్నవి:


గీ... ... ... ... ... ... ...

ప్రథిత చరకాది వైద్యశాస్త్రప్రవీణు

డమలమతి రామమూర్తి నామాంకితుండు.


క. తిరుపతి వేంకట కవులం

దిరువురిలో నొకడు వేంకటేశ్వరకవికిన్

జిరజీర్ణ కృఛ్ఛ్ర రుజమును

సరసౌషధముల నొసంగి సాధించె వడిన్.


గీ. శ్రీలలితమైన యట్టి మాపోలవరము

నందు మానద్వయం బుండి యౌషధంబు

పుచ్చుకొనియెను వేంకట బుధుడు మాకు

మువ్వురకు నేస్తమయ్యె నప్పుడు దృడముగ.


క. నీరుజుడై విశ్వాసము

ప్రేరేపన్ జెళ్ళపిళ్ళ వేంకటకవి మా