కల్యాణము పరికింపవలయును. 'రాజధర్మము' నుగూర్చి వీరి పద్యములు చూడుడు.
గీ. రాజు నిజదేశమునకును బ్రజలకు దొర
ననుచు దలపక తన్ను శ్రీహరిజనులకు
సేవ వ్హేయుట కొఱకే సృజించె నంచు
నెంచి విఱ్ఱవీగక సంచరించు టొప్పు.
గీ. ప్రజలు శ్రమపడి యార్జించి భక్తి దనకు
నిచ్చినధనంబు వారికై వెచ్చ పెట్ట
కాత్మభోగాళి కొఱకును ఖ్యాతికొఱకు
వమ్ముసేయుట తగునె నృపాలకులకు
ఆ. వె. తనదు ప్రజలు వెతలు గను చుండ వారిని
తలప కన్య దేశములకు నేగి
సామి యలర దగునే ? జనుల రంజింపని
వాని నృపు డనంగ బాడి యగునె ?
గీ. ప్రజల సుఖదు;ఖములు ధరావరుడు దనవి
గా దలంచుచు నీతిమార్గమున జనుచు
సజ్జనుల గౌరవించుచు స్మయము పడక
పరమపురుషుని భక్తిచే బరంగవలయు
ఈ రాజధర్మముల గీటుదాటకుండ బ్రజాపాలనము చేసిన విక్రమదేవవర్మ యభినందనీయుడుగదా! 1940 సం. లో "శ్రీమహాదేవ వర్మ రచనలు తలిసెట్లి రామారావు గారు ప్రచురించిన అనేక గద్య పద్యములున్నవి. నేటి తెలుగు అను శీర్షికతో శ్రీ మహాదేవ వర్మగారు వెలువరించిన రచన నిచట ప్రచురించెదను. ఈవ్యాకరణంలో వ్రాసిన నాధునికాంధ్ర బస గూర్చి శ్రీవారి యభిప్రాయము