పుట:AndhraRachaitaluVol1.djvu/385

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విక్రమ దేవవర్మ

1869


శ్రీ జయపుర సంస్థాన ప్రభువు. క్షత్రియుడు. కాత్యాయనసూత్రుడు. భారద్వాజసగోత్రుడు. తల్లి: రేఖాదేవి. తండ్రి: శ్రీకృష్ణచంద్రదేవ మహారాజు. జననము: 1869 జూన్ 28 వ తేదీ, (శుక్ల సంవత్సర జ్యేష్ఠ బహుళ తృతీయాగత చతుర్థీ భానువాసరము. గ్రంథములు: 1. శ్రీనివాస కల్యాణము (నాటకము) 2. మానవతీచరిత్ర. 3. -- 4. శృంగారగీత వ్రాతము 5. శ్రీ మహారాజ విక్రమదేవవర్మ రచనలు (1940 ముద్రితము) 6. కృష్ణార్జున చరిత్ర టీక (మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి రచించిన ద్వ్యర్థి కావ్యమునకు వ్యాఖ్యానము) 7. రాథామాధవ నాటకము (ఉత్కలము) ఇత్యాదులు.


ఆంధ్రరాజులలో 'కృష్ణదేవరాయలు' అద్వితీయుడుగా బరిగణింపబడినాడు. శౌర్యసంపదను మించిన యుత్సాహము, భాషాభిమానమును మించిన కవిత్వశక్తి, విద్యత్పోషణమును మించిన కళాదరము నతనియందుండి తెలుగుమన్నీల కతని దొరతనపు దెన్ను మేలుబంతియైనది. 'ఆముక్తమాల్యద' నీమహారాజ శిరోమణి రచించినటులుగా పరిశోద మహాశయులు నిర్ధారించియున్నారు. ఈ వాస్తవవిషయమును----పఱుచుటకు, ఆంధ్రకవితాపితామహుడు నాస్థానకవియునగు పెద్దన రచింప చేసి తనపేరు పెట్టుకొనె యని విపరీతవిమర్శనములు బయులు .................. .................. ............ ............ ............. ........... .....................

(పై ఖాళీలలోని అక్షరములు కనబడుటలేదు)