శాస్త్రిగారు 1897 లో జన్మించిరని తెలిసికొంటిమి. ఈగ్రంథము నాటికి వారికి, ఏబది మూడేండ్ల వయస్సు. శాస్త్రిగారు పదుమూడేండ్లు వచ్చిన తరువాత 'నెమళ్ళదిన్నె' నుండి ప్రొద్దుటూరు వచ్చి యచ్చట రూపావతారము శేషశాస్త్రులుగారి సన్నిధికి జేరి కావ్యనాటకాలంకారసాహిత్యము, తర్కవ్యాకరణశాస్త్ర నైపుణ్యము సంపాదించిరి. పిమ్మట షడ్దర్శనము వాసుదేవావధానులుగారిని సేవించి యుజుస్సంహితామూలము, యుజురారణ్య కోవనిషత్తులతో సప్రయోగ స్మార్తమంత్రపాఠము అధ్యయనించిరి. జాతక-ముహూర్త-సాను ప్రకరణములు చదువుకొనిరి. సంస్కృత పాండితిలో గురుకుల క్లేశమందుపడి గడిదేఱినతరువాత, ఆంధ్రకావ్యములు చూచి, మహాభారతము పారాయణము చేసి, ఛందశ్శాస్త్రము నెఱిగి, తొలిజన్మములో వలచి వెంట వచ్చిన కవితాసుందరిని గిలిగింతలు బెట్టి చేరదీసికొన్నారు శాస్త్రిగారు.
1912-13 సంవత్సరప్రాంతములో శ్రీ దుర్భాక రాజశేఖర కవితో మన ప్రకృతకవికి నేస్తము తటస్థపడినది. "రాజశేఖర వేంకటశేషకవులు" అను జంట యేర్పడి కవితావ్యాసంగమున కుపక్రమించినారు. తపస్సున కొకడే యుండవలెను. అథ్యయనమున కిరువు రున్నగాని ససిపడదు. 1915 లో బృందావనమున శరన్నవరాత్రమహా--సందర్బమున జరిగిన కవిత్వపుబోటీలో దొలి బహుమానము మన కవులు సంపాదించిరి. ఈకవులజంట విడనప్పుడు 'వీరమతీచరిత్రము' అను పద్యకావ్యము, సీతాపహరణము, కీచకవధ అను నాటకములు రచించి యుండిరి. 1920 మొదలు 1926 దాక జతవిడక 'రాజశేఖర-వేంకటశేష కవులు' అష్టశతావధానములు పలుచోట్ల గావించిరి.--------------------------------సువర్ణకంకణములు కాన్కబెట్టిరి-------------------------------------------------------------------
.........
..........
..................
...........
(పై ఖాళీలలోని అక్షరములు కనబడుటలేదు)