పుట:AndhraRachaitaluVol1.djvu/382

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శా. నా కీవంత-కొఱంత వో; దయిన దానా! నీవుధన్యుండ ; వ

ఱ్ఱాకల్ లోకువ లన్నియున్ దులిపి వీరస్వర్గముం గొంటి ; వే

కైకస్థాన ముదాత్తవీర పురుషత్యాగార్హ భోగాంకమై

నీ కాహ్వానము పెట్టె, నేల్కొనుము తండ్రి! వీరభోగ్యంబుగన్. [సప్తమాశ్వాసము]


అష్టమాశ్వాసములో శివాజీరాజు పట్టాభిషేకము, గాంగభట్టు ధర్మనిర్వచనము మున్నగు ఘట్టములు కవిగారి శ్రుతిస్మృతిపురాణనివిష్ట బుద్ధిని ప్రస్ఫుటీకరించుచున్నవి. ఎట్టి శుష్కవిషయమునైనను కళకట్టించి కవితలో లలిత మనోహరముగా బెట్టగల నేర్పు తీర్పు వేంకటశేషశాస్త్రిగారి కతివేలముగ నున్నది. నిజమునకు, శివాజీ చరిత్రములో వచ్చు వ్యక్తులలో గవితకెక్కదగ్గ కళాశక్తిలేదు. వారెల్ల మనకవి వసంతుని చేతిలోబడి పుష్పించి పరిమళించిరి.


పట్టాభిషిక్తుడగు శివరాజు భవాని కోవెలకేగి యిట్లు ప్రార్య్హించినాడు-


చ. చిఱునగపూరుమోవి, వికసించిన చెక్కులు, సోగకన్నులం

గురియు దయామృతం బలిక కుంకుమరేఖయు జంద్రమ:కళా

పరిగత మౌళియున్ నయన పర్వముగా మది గోచరించి నా

యరగలి బాపు నీయభయహస్తమునీడ భజింతు శాంకరీ!


ఈ శివాజీ ప్రబంధమునకు 'భారతము' అని పేరిడుటలో నొక విషేశమున్నది. ఇందు దఱచుగ భారతములోని యుపములే యీయబడినవి. అవియెల్ల నిట నేఱిచూపను. తత్త దుదాహరణములకు గ్రంథము పఠింతురుగాక!


శ్రీ వేంకట శేష శాస్త్రి గారి జీవిత ప్రబంధములో 'శివభారతము' కీర్తనీయమైన స్వర్ణ ఖండము. దానిని తొలుత బేర్కొనిగాని, వారి చరిత్రవిషయములు ముచ్చటించిన సొగసు లేదు.