పుట:AndhraRachaitaluVol1.djvu/37

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వెనుక శ్రీవీరేశలింగం పంతులుగారు రాజమహేంద్రవరమున ఆర్ట్సు కాలేజిలో దెలుగుపండితులు నుండునపుడు కస్తూరి శివశంకర శాస్త్రి గారిది సంస్కృతపండిత స్థానము. శాస్త్రిగారు పరీక్షాపత్రము సెస్సగా వ్రాసినవారికి నూటికి నూటపది మార్కులు వేయుచుండువారట. ప్రిన్సిపాలు 'ఇదేమిపాప' మని యడుగగా, 'ఆవిద్యార్థిపుణ్య' మని నిరంకుశముగా సమాధానించుచుండు వారట. మన రామచంద్ర శాస్రిగారి నైరంకుశ్య మాతీరులోనిదే.

మాడభూషి వేంకటాచార్యులవారు మన శాస్త్రిగారి ప్రతిభ నెరుంగదలచి "శ్లో. చింతకాయ కలేకాయ బీరకాయ తమారికే, ఉచ్చింతకాయ వాక్కాయ సాధకాయ తమాంజలిమ్" అని యొకశ్లోకము వ్రాసి శిష్యున కిచ్చి రామచంద్ర శాస్త్రి వీని కర్ధ మెట్లు చెప్పునో కనుగొని రమ్మనెనట. అంతట శాస్త్రులుగారు దాని కర్ధముచెప్పుటయేగాక మాకి రెండు గడ్డుశ్లోకములు వ్రాసి యాచార్యులు గారికి బంపి నిరుత్తరులను జేసి రని వదంతి.

ఈయన సంస్కృతాంధ్రములలో జాలకృతులు రచించెను. పండ్రెండవయేటనే యుపదేశము పొందెను. 'దేవివిజయము', కుమారోదయము' అను గ్రంధములు వీరి యుపదేశవిషయమును స్పుటీకరించును. 1860 ప్రాంతమున మంజరీమధుకరీయ నాటకము సంఘటించిరి. ఈనాటకమునకు ముందు దెలుగున ఎలకూచి బాలసరస్వతి విరచితమగు 'రంగకౌముది' నాటకమున్నట్లు వినుకలి. మంజరీమధుకరీయములోని కధ కల్పితము. ఇది రంగమున కననుకూలము. ఇందలి కవిత్వము కఠినము. మచ్చున కొకపద్యము చూడుడు:

మ. పికదష్టామ్ర కిసాల దంతిపటియ త్సీనస్పుర త్సౌరభ
ప్రకటోద్గార రజోగుళుచ్చ కుచభార ప్రహ్వ సంజాతకో
రక రోమోద్గమ సాంద్రమంద్ర కలనిర్ర్హదనగ్రీవ, యీ
సకలశ్రీవని యామనిం గదిసి హృజ్జక్రీడలన్ సల్పెడిన్.