పురుషుడుగా, నవతారపురషుడుగా జిత్రింపబడి యున్నాడు. భారతజాతీయధర్మము పరాధీనము కారాదను పట్టుదలతో ధర్మసమరము గావించిన లోకజ్ఞడు ప్రతాపుడు. అక్బరుబలగముముందు ప్రతాపుని పక్షము చాల దక్కువ. అతడు పాదషాతో బ్రతిఘటించి యుద్ధము చేయుటకు గొంత జంకినాడు. కాని, ఓర్చి ధర్మసమరమే సేయవలయు ననుకొన్నాడు. క్షురకర్మ పరిత్యజించి నిద్రాహారమువిడచి యడవులలో దపించు జాతికి స్వాతంత్ర్యభిక్ష పెట్టినాడు. ప్రతాపుని కాలమునాడు మన మెవరముగానో బ్రతికియుందుము గాని, నేడు ప్రతాపుడు లేడు. అతనిచరిత్ర మెఱపు మెఱపులుగా భారత దేశాకాశమున మెఱయచున్నది. ఆమెఱుపుల నన్నిటిని కేంద్రీకరించి నిలువుచేసి తెలుగునేలకి మూటగట్టి పెట్టినవారు రాజశేఖర కవిగారు. వారిమేలు మఱవరానిది. నాయకునితో దాదాత్మ్యము నంది రచించిన కృతియిది - ఈ పదములు చదువుడు:
నే నెల్లప్పుడు భావనాబలమునన్ నీరూప నామక్రియా
ధ్యానంబుం గొని తన్మయత్వమున నన్యాకాంక్ష లేకుంటి; నీ
వే నేనైతినొ, నేనె నీవయితొ ? రూపింపంగ నాకేల నీని
త్యానందంబు ఘటించె నీకృతి ప్రతాపా ! విశ్వలోకార్చితా
దినరాజుంబలె నుగ్రకోపనుడవై తీండ్రించి శైలంబు నిం
డిన తౌరుష్కుల దాకి నీనడపు హాల్డీఘాటు యుద్ధాంగణం
బున విశ్వోన్నతమైన నీదువిభవంబుం గొంత నే బంచుకో
గనకున్న న్నినుగూర్చి యింతయనురాగం బిట్టు లుప్పొంగు
ఇలగల వీరపుంగవుల నిట్టి బలోన్నతు డిట్టి ధీరుడుం
గలుగ డటంచు బేర్గనిన గండడ వీవిక ; నిల్లువీడి వీ
ధుల జరియింపలేని కడుదుర్బల దేహుడ, నన్ను నెట్టులన్
వలచిత; నీచరిత్రమును వర్ణనసేసి జగాన జాటగన్.తాడో