పుట:AndhraRachaitaluVol1.djvu/366

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొన్నేండ్లుగా నూహించి భావించి ధ్యానించి తన్మయులై రాజశేఖరకవిగారు కవితలో జొనిపి యతని నజరామరుని గావించిరి. పద్యచరిత్ర గ్రంథములకు నీ ప్రతాపసింహ చరిత్ర యొరవడి దిద్దెననుట సత్యమునకు సమీవస్థమగు మాట. తెనుగులో బురాణయుగము వెంట బ్రబంధయుగము, దానివెంట గావ్యయుగము, అనువాదయుగము తలనూపి ముంచివైచినవి. ఈ నవీనశకమున నెన్నో మార్పులు వెలసినవి. నేడు పురాణములమీద గంటె, చరిత్రకృతులపై మక్కువ యెక్కువగ నున్నది. భారతదేశ స్వాతంత్ర్యమునకు బహుధా పోరాడుచున్న కాలమున "ప్రతాపసింహచరిత్ర" వంటి కృతులు వెలసి యుపకరించినవి ఇట్టి చరిత్ర కావ్యములకు రాజశేఖరకవిగారిది మార్గదర్శకస్థానము.


ప్రతాపుడు పవిత్రనాయకుడు. ప్రాచీనధర్మత్రాణపరాయణుడు. పసి పూరి రొట్టెలు తిని యడవులలో దపము చేసి యిరువదై దేండ్లు పాదుషాతో సంగ్రామము చేసి కృతకృత్యుడైన భగీరథుడు. అక్బరు ప్రతిపక్ష నాయకుడు. "ప్రతిపక్ష గుణవర్ణనము - తజ్జయమువలన నాయకోత్కరము" అని యాలంకారికులు. ఈసమయము రాజశేఖరకవిగారు చక్కగా నీ గ్రంథమున సమన్వయపఱిచి వివరించినారు. గ్రంథము కడముట్ట జదువుదాక, ఈ కబ్బములోని నాయకుడు అక్బరో, ప్రతాపుడో పాఠకునకు దెలియదు. ఏసందర్భమునను బ్రతినాయకుని దీసికట్టుగా వర్ణింపని కవిగారి యుదారహృదయమునకు మహమ్మదీయులు కృతజ్ఞలై యుండవలయును. శ్రీ గాంధి మహాత్ముని మనస్తత్త్వమును లెస్సగా గుఱుతించుకొని దేశసేవలో నలగినవా రగుటచే గవిగా రిటులు సంతరింపగలిగినారు. ఈ చరిత్ర కావ్యమున బ్రతాపునితోఫాటు అక్బరు, మానసింహు లమృతులగు నాయకోత్తములు.


ప్రతాపుడు చరిత్రపురుషుడైనను మనకవిగారి చూపుచే బురాణ