Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/368

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భవదుదార శౌర్యమును భావన మొనర్చి

రసమునను జొక్కి గ్రంథంబు వ్రాయునపుడు

త్వద్వశుండనై యానందబాష్ప వితతు

లాణిముత్యాల వలె రాల్తు సహరహంబు.


ఈ నాలుగు పద్యముల గర్భమున బ్రతాపచరిత్రము, రాజశేఖర కవియు దాగియున్నారు. తాదాత్మ్యము లేని పద్యము లీకృతిలో లెక్కకున్నవి. అట్టివి చరిత్రగతి కొఱకును, దృష్టిదోష పరిహృతికొఱకును గలవా యనిపించును. "నిజముగా తాము ప్రతాపుడే యనుకొని యాయా ఘట్టములు చదివి వినిపించుచు నానందబాష్పములు రాల్చుచుందు" రని రాజశేఖరకవిగారినిగూర్చి కొందఱు చెప్పగా విందుము. ఈ కబ్బమునందలి పద్యములు మంచి వాటముగా నడచినవి. సీసముల మీద హెచ్చుపాలు ప్రీతి ప్రదర్శింపబడినది. సర్వవృత్తములు తీపసాగినట్లు సాగుచున్నవి.


మ. ఉదయాస్తాచల మధ్యగంబగు జగం బుఱ్ఱూత లూగించె ; బె

ట్టిదుడౌపుత్త్రుడు; ఘోరసంగర కిరీటిప్రాయుడై కీర్తి సం

పద నార్జించెను దండ్రి; యెట్లితడు మేవాడ్రాజ్య మందారశా

ఖి దినం జొచ్చిన పుప్పియట్లు వొడమెన్ గీర్తిం గళంకించుచున్. [ప్రథమాశ్వాసము]


మ. అకటా! నీయెడ నెయ్యపుంబలిమి నే నల్లూడితిం గాక యే

టికి నాప్రార్థన మియ్యకొందు, నెపుడున్ డెందంబునన్, దేశమా

తకు వాటిల్లు విపత్తుకై వగచి చింతం గ్రాగు నీవగ్గి మ్రిం

గక స్వాతంత్ర్యము దక్కుదాక నొకచో గాలూని కూర్చుందువే? [ద్వితీయా శ్వాసము]


మృదువు దప్పని జాతీయములు వాడుటలో రాజశేఖరకవిది మంచి నేర్పు. అభిమన్యుపై చేయి - ఇది పెదవి దాటు పల్లవి యెపుడొవిడచి