Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/353

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నెక్కడలేని యెఱుకయు నున్నది. కాని, వానికన్నిటికి ననురూపమైన--కాదు వారి సాహిత్యసేవ. యౌవనము ధారవోసి వ్రాసినగ్రంథములెన్నో మసియైపోవుటయు దొంగలెత్తుకొని పోవుటయు జరిగి శాస్త్రిగారి యుత్సాహ మాడనిబాడెను. ఇప్పటికి బది పండ్రెండేండ్లనుండియు హృదయ దౌర్బల్యముపొడమి మఱింత దిగాలుగనున్నారు. అయినను, ఓపిక వచ్చినపుడెల్ల గథయో, కావ్యమో, వ్యాసమో వ్రాసి తెలుగు వారికి విందు లొనర్చుచునే యున్నారు.


శ్రీ శాస్త్రిగారి ఖండకావ్యసంపుటము 'ఏకావళి' లోని పదములు అను శీర్షికతో నున్న పద్యములలో నొకపద్యము చిట్టచివర స్మరణకు దెచ్చుకొని చాలించెదను.


సీ. వీణియపై జేయి వేయదు వాగ్దేవి

మానైజ సంగీతమహిమ వించు

వలినాననుని నాల్గువగుమోము లెక్కడె

క్కడసంచుమాకు స్వాగత మొసంగు

మౌనవర్యులు మనోమందిరంబుల యందు

నలరింత్రు మాకు సింహాసనంబు

కవిరాజ లమృతంబు కడగాల బెట్టి మ

మ్మాదరింతు- భావమేదురముగ

................................... ........................ ....................... .................. .................... (పై ఖాళీలలోని అక్షరములు కనబడుటలేదు)