పుట:AndhraRachaitaluVol1.djvu/352

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చెను. నాలో నేనే దహించుకొని పోయితిని. నా కీ జగతి యంతయు నిస్సారముగా దోచెను. ధర్మారెడ్డి చిత్తరువేని లేనియెడల నామేడ చవుటిదిబ్బగా నుండెడిది. ఒక రేయి యంతయు నేనాచిత్తరువు నెదుట నుంచుకొని కూరుచుంటిని. కొంతసేపు దానితో వినోదించితిని. క్రమక్రమముగా నాకనులవెంట బాష్పములు స్రవించినవి. తెల్లవారు లటులే కూరుచుంటిని. అపుడు మయూరము లొకటొకటి లేచి స్తంభమెక్కి కూయదొడగెను...నేను స్వప్నమున ధర్మారెడ్డి కొక ఉత్తరమును వ్రాసితిని. వ్రాతకుపకరణము కలముకాదు. వ్రాత కుపయోగించినది కాగితమును గాదు. ఇచ్చ నా మానసముమీద నన్ను కరగించి కరగించి కరకకాయ సిరాచేసి అక్షరములుగా పోసినది. అపుడు ధర్మారెడ్డి నాలో ఒకభాగముగా నుండెను. గాన దానిని పఠించెను....'క్షమాపణ' కథ 'భారతి' ప్రభృతులగు పత్త్రికలలో వెలువరింపబడిన వీరి కథానికలు కుప్పనగూరలు. వానినెల్ల సంపుటీకరించి ప్రచురించుట తెలుగుబాసకు గడు మేలుసేత.

వ్యావహారికముకూడ శాస్త్రిగారు తఱచు వ్రాయుచుందురు. శ్రీ శరచ్చంద్రుని చిన్ననవలలు వాడుకభాషలోనే వ్రాసినారు. ఏమివ్రాయనిండు, ఏభాషలో వ్రాయనిండు, తీరుతియ్యములు గల నిండు దెలుగులో రసవిలసితముగ వ్రాసి పాఠక హృదయముల వలవైచి లాగుదురు.

గాంధిమహాత్ముని


................. ................. .................... ...................... .................... (పై ఖాళీలలోని అక్షరములు కనబడుటలేదు)