పుట:AndhraRachaitaluVol1.djvu/351

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

గురువు లొకరు లేరు. ఆంగ్ల, వంగాది భాషా గ్రమ్య్హావలోకనమే యక్కడ ముఖ్యకారణము. అది యటుండె, ఈయనకు జాలకళలలో జక్కని యెఱుక యున్నది. సంగీత మెఱుగుదురని వ్రాసియుంటిని. అభినయ కళలో బ్రవేశ మున్నది. నాటకము లన్నను, చలన చిత్రములన్నను మక్కువ చూపుదురు. 'జయాపిల్ముస్‌' వారి 'జరాసంధ' కు కథాసంవిధానము గావించినది వీరేగదా ? ఇంక కథారచనములో జెప్పవలసినపుడు వీరు సిద్ధహస్తు లనవలయును. ధ్వని ప్రాయము నున్న వారి పలుకుబళ్ళు కథలలోసైతము కావ్యత్వమును స్ఫురింప జేయుచుండును. సాధారణముగ వీరి కథలెల్ల సలక్షణ భాషలోనే వడచినవి. ప్రతి కథ యందును; సాహిత్య వాసన యుండును. భావగంభీరత యుండును. కథా కల్పనము విషయమున నీయనను మించినవారు నేడు కొందఱున్నారుగాని, వచన రచనా విషయమున నీయనను---వారు నా దృష్టిలో మిక్కిలి తక్కువ. భాష సలక్షణ మగుటయు, భావము గంబీర మగుటయు, బలుకుబడి మితముగా నుండుటయు, ధ్వనికి బ్రాధాన్య మిచ్చుటయు, వీరి వచనములోని ప్రచురగుణము మచ్చున కొక కథలోని పంక్తులు పది తీసి చూపెదను.


. ............. ................ ................... ................... .................... ................... .................... ..................... (పై ఖాళీలలోని అక్షరములు కనబడుటలేదు)