పుట:AndhraRachaitaluVol1.djvu/339

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

యన్నియు నెవ్వరికడనున్నవో ? ఏమైనవో ? - వేదాంతమున ననంతపరిశ్రమముగావించి గ్రంథములు, ననేకవ్యాసములు వీరు ప్రచురించిరి. శాస్త్రిగారు గద్వాల, ఆత్మకూరు, ముక్త్యాల మున్నగు వివిధసంస్థానములలో బ్రతివాదిభయంకరముగా గవితాప్రదర్శనము గావించుచు, బిరుదములు తాల్చుచు గీర్తికాములై ప్రవృత్తిపథమున సంచరించిన వారుగా స్థూలదృష్టికి దోచినను, సామాన్యులకు గోచరింపని నివృత్తిమార్గముననే వీరిచిత్తము సంచరించుచుండెడిదిదని యిక్కడ జెప్పదగిన రహస్యము. ఆయన సహజసాత్త్వికరూపము, శాంతగంభీరభాషణము, నిత్యభాష్యపర్యాలోచనము, కర్మాచరణము స్మరణీయము లైనవి. ఇట్టి గర్వరహితుడు, నిష్ఠాసహితుడు పండితులలో నూటికి గోటికి నుండుననుటకు సంశయపడను. వైశ్వదేవము చేయక వీరెన్నడు నన్నముతినలేదు. ఈయన యెప్పుడును 'తమపేరే' మనియడుగ 'సుబ్బయ్య' యనియే చెప్పెనుగాని సుబ్రహ్మణ్యశాస్త్రి యనుకొనలేదు. తమ యాంధ్రధ్వని మీద బ్రతికూలాభిప్రాయము వెల్లడించి దొసగులున్నవని యెన్ని పత్రికలో బ్రచురించినపుడు, శ్రీ తాతా సుబ్బరాయశాస్త్రిగారికి లేఖమూలమున "మహాశయ! మీరు ప్రత్త్రికాముఖమున బ్రకటింపనేల ? మీ వంటివారు ప్రత్యేకముగ నాకు దెలిపిన సరిచేసి కొనక పోయితినా ?" యని వ్రాసి పంపిరట. మఱియొకసంగతి:-


కాట్రావులపల్లి (జగ్గంపేట) జమీందారు శ్రీ దామెర సీతారామస్వామిగారు రసికుడైన విద్వత్ప్రభువు. వారిదర్శనమునకు మన శాస్త్రిగారొక తూరి వెళ్లి, రాజగురువులను జూచి, ఆయన యేమి చదివితిరని ప్రశ్నింప "నేదో కొంచెము సాహిత్యము, కొంచెము వ్యాకరణము, కొంచెము కవితనల్లుట గురుకటాక్షమున నేర్చుకొంటి" నని చెప్పిరట. అప్పుడాయన 'పిఠాపురపు బరీక్ష^ నొనగితిరా ? యని యడిగిరి. లేదని శాస్త్రిగారు సమాధానము చెప్పిరి. లేనిచో మాఱేని దర్శనముకాదని