నీదు చల్లని కాన్పున నెగడినట్టి
పౌరుషాదార్యరేఖల బ్రస్తుతించి
పోవునో యేమొ, నీపేరు పుడమి విడిచి
శూరగర్భ వొకప్పు డెండ్లూరుతల్లి!
బళీ! ఏండ్లూరు పూర్వము శూరగర్భయట. నేడు జెముడుపొదలతో నిండియున్నదట. ఈ దుస్థితి కవి నెంత పరితపింప జేసినదో ? ఆర్ద్రహృదయుడగు నీకవి హృదయ ప్రణీలికనుండి యుబికిన యీ సహజ కవితాప్రవాహము రసవిదులకు దలమున్కలు చేయుచున్నది. ఇట్టి పద్యములు నాలుగే వ్రాయుగాక, అవినాలుగు కావ్యములుకావా ? శ్రీశాస్త్రిగారు 'భారతి' లో వెలువరించిన యీసందేశము చదువుడు.
"......నవీనరహస్యములను గల్పనాప్రపంచముద్వారా వాజ్మయ ప్రణాళికలో బ్రవహింపజేయు నుకవుల సందేశము లుగ్గుబాలుగ నేజాతికి జీర్ణమగుచుండునో, వారిదే యభ్యుదయము, వారిదే స్వాతంత్ర్యము, వారిదే విజయము......" భారతిప్రభృతి పత్త్రికలలో నప్పుడప్పుడు ప్రకటించిన ఖండకావ్యములుగాక, వీరి పద్యకృతులు ప్రత్యేకముగ నచ్చుపడినవి కానరావు 'దైవబలము' అనుపేరుగల భక్తి ప్రధానమగు చిన్న కావ్యమొకటి ప్రకటితము. "మేఘుడు" అనుఖండ కావ్యము నవీనమార్గములో జివరికాలమున వీరు రచించినది ప్రచురింప బడలేదుగాని, శాస్త్రిగారిశిష్యపరంపర నోళ్ళలోనానుచున్న కొన్నిపద్యములు విన్నచో నది రసపరిప్లుతమగు కావ్యమని తోచును. వీరి యాంధ్రధ్వని, తెలుగుకావ్యాదర్శము, కావ్యనాటకాది పరిశీలనము మొదలుగాగల రచనములను జూచిన నలంకార శాస్త్రమున నీయన యెట్టి పరిశ్రమ గావించెనన్న దానికి బ్రత్యుత్తరమిచ్చును. రసగంగాధర మాంధ్రీకరించిరని కూడ దెలియవచ్చినది. రామాయణకథను దీసికొని సంస్కృతమున నాటకములుగా నిబంధించిరనియు జెప్పుకొందురు. మఱి, అవి