పుట:AndhraRachaitaluVol1.djvu/317

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లోని పండిత కవులెందఱో కలుగ జేసికొని పైకి వచ్చిరి. ఇది సారస్వత చరిత్రలో మఱవరాని సరసఘట్టము ఈ వివాదారంభమున 'కవిత' యను మాసపత్రిక రామకృష్ణులు నెలకొలిపి నడపిరి. ఈ పత్త్రిక తొమ్మిది పదియేం డ్లవిచ్ఛిన్నముగా సాగి యాగినది. చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారికి, వేంకటరామశాస్త్రి గారికి గల గురు శిష్య సంబంధమును బురస్కరించుకొని యీ వివాదము ప్రారంభమైనది.

ఎట్టొ చదివితి మూన్నాళ్ళ పట్టపవలు

పట్టుమని రెండుముక్కలు పలుకకున్న

దిరుగ డికనెన్ని చెప్పిన గురుడ ననుచు

దగులు కొన్నాడు నిన్ను సైతానులాగు

రామకృష్ణ మహాభారతము లోని యీపద్యము వేదుల రామకృష్ణశాస్త్రి ఓలేటి వేంకట రామశాస్త్రిని గుఱించి చెప్పినది. ఈ పద్యములో యావద్విషయము గొప్పగా సరిస్ఫురిత మగుచున్నది. శ్రీ చర్ల నారాయణశాస్త్రిగారు రామకృష్ణుల సాహిత్య గురువులు. రామడుగుల వీరేశ్వరశాస్త్రిగారు వ్యాకరణ గురువులు విశ్వపతిశాస్త్రిగారు న్యాయశాస్త్ర గురువులు.

దేవులపల్లి సోదరకవుల తరువాత వీరు పిఠాపుర సంస్థాన కవులై పేరొందిరి. మొత్తము రామకృష్ణకవుల కృతులు ముప్పదివఱకున్నవి. శ్లేషయమకచక్రవర్తి వేంకటాధ్వరి రచనము నాంధ్రీకరించుట యేటి కెదురీదుట. ఈతని రచనలో యనుక భేదమో శ్లేషాలంకార భేదమో లేని పద్యములు మిక్కిలితక్కువ. అట్టివిశ్వగుణాదర్శమున కాదర్శప్రాయమగు నాంధ్రీకృతి గావించిన రామకృష్ణకవులు ప్రశంసనీయులు. తెనుగు మధ్యన కొకచోట మూళాను వాదములు మూదలింతును.