పుట:AndhraRachaitaluVol1.djvu/311

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్వ్యాపారమ్మును మాఱితీరుననుచున్ గారుణ్యమొప్పార నా

వైపే చూతురు పంపుమమ్మ సభకున్ పండితు గామేశ్వరీ!

మ. కవులెల్లన్ జయపెట్టు వైభవ మొసంగన్‌లేదొ తచ్ఛిష్యవ

ర్గ విభూతిన్ గరుణింపవో తనుజనుర్భాగ్యంబు గై సేయవో

వివిదైశ్వర్యము లిచ్చితింక నొకటే విశ్వేశి! నీసన్నిధిన్

గవిగానుండ ననుగ్రహింపు మిదియే కామ్యంబు కామేశ్వరి!

శ్రీ వేంకటశాస్త్రిగారి కామేశ్వరీభక్తి కీ పద్యములు నిదర్శనమణులు. ప్రభుత్వసంస్థాన కవితాపదవికి మెఱుగుపెట్టిన శాస్త్రిగారు, ఆపదవి వచ్చిన కొలదినెలలకే పరమపదము జేరుట మనదురదృష్టము. ఆంధ్ర సారస్వతారామమున ననంతశోభతో వెలుగొందిన వసంతరేఖ యస్తమింపగా, ఆయన శిష్యుడు పింగళి లక్ష్మీకాంతకవి పాపము ! ఎట్లు వగచెనో కనుడు.

మరల దిరుపతి వేంకటేశ్వరులజంట

కలిసె, ముప్పదియేండ్ల పై కాలమునకు

సాగ గలదింక దిక్పాల సభలయందు

అద్భుతాపహ శతావధానాంధ్ర కవిత.

        *          *

మాగురుం డిప్డు దిగిన వాజ్మయపుగద్దె

యుర్వి ననధిష్ఠితంబయి యుండగలదు;

ననభిగమ్యము నప్రధృష్యమ్ము నగుచు

విక్రమార్కుని సింహాసన క్రమమున.

       *            *

ఈ జంటకవుల కావ్యములలో "బుద్ధచరిత్రము" చక్కనిపాకమున బడినది. వీరి దేవీభాగవతతో పాటు బుద్ధచరిత్రము సారస్వత లోకమున స్థిరముగా నుండునని చెప్పవలయును. తిరుపతి కవుల కావ్య