పుట:AndhraRachaitaluVol1.djvu/312

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ములకంటె, వారినిగూర్చిన గాధలు, వారు చెప్పిన చాటువులు, వారి వీరాలాపములు, వారి చమత్కార సంభాషణములు దేశములో నిలిచిపోగలవు. కవితకు జీవితమునకు భేదము లేదని నిర్ధారణము చేసినవారొక్క తిరుపతి కవులే. ఈ జంటకవుల జీవిత-కవితా మాధుర్యములు పడుగుపేకల వలె విడదీయరానివై కలసియున్నవి. వీరు ప్రాచీన ప్రబంధ ధోరణి వీడి నవ్యమార్గములో వర్ణ నాదులు కావించిరి. శ్రవణానందాదులలోని శృంగార వర్ణనములు కొంత హద్దుగడచినటులు కనబడును. కాని, నాడవి రసవంతముగానే యగపట్టినవి. "రాజులెల్లరును భార్గవరాములే యన్న దేజంపు బెంపు సుతింప వలెనె, కోమటు లెల్ల జక్కులరాజులే యన్ననైశ్వర్యముల పెంపు లడుగ వలెనె......" ఈమొదలగు వర్ణనములు పూర్వవాసనా వాసితములు. "మనమా ! వద్దిక నాదుమాట వినుమా మర్యాద కాపాడుమా!" మున్నగు పద్యములకు దెలుగుదేశమున నాశనము లేదు.

'వ్యాకరణ మొకత్రోవ, మహాకవు లొకత్రోవ' యని చెప్పి తిరుపతికవులు వ్యాకరణబంధములు నిరంకుశులై సడలించి గిడుగువారి వాదమున కాదరువునిచ్చిరి. ఈ కవకవుల జీవనజ్యోతి సర్వాభినవ కవిరక్ష, వారి పద్యములు సర్వము శిష్య ప్రశిష్యద్వారమున లోకమెల్లెడ వ్యాప్తములై యచ్చులోలేకున్న, అయిదాఱు శతాబ్దులదాక నశింపని స్థితిలోనున్నవి. పాండవనాటకములు, శ్రవణానందము, మఱికొన్ని చాటువులు పారాయణము చేసికొనువారు చాలమంది కలరు. ఈక్రింది పద్యములు మఱచిపోలేము.

శతఘంట కవసమ్ము సల్పుసంగతి యన్న

"గరతలామలకమ్ము" గాదె మాకు

అష్టావధాన కష్టావలంబన మన్న

"నంబి కొండయ దండనంబు" మాకు