కన్న సంతానమ్ముకన్న నెక్కుడుగాగ
నే దయాళుండు మమ్మాదరించె
పెండ్లి పేరంటముల్ ప్రియ మెలర్పగజేసి
యే గుణనిధి మమ్ము బాగుచేసె
తిండికై యిల్లిల్లు దిరుగనీయక యన్న
మేయన్న దాత మాకింటనిడియె
గీ. సకలదిగ్దేశ రాజన్యసభలయందు
డంబుమీఱ శతావధానం బొనర్చి
నిర్వహింపగ నెవ్వ డాశీర్వదించె
నట్టిగురునకు గృతియిచ్చు టర్హమకద!
బ్రహ్మయ్యశాస్త్రిగారి కీర్తి పరమశాశ్వతము చేసిన శిష్యులు తిరుపతి వేంకటకవులే. ఇదియటుండ, తిరుపతి కవులకే పరస్పరము శైష్యోపాధ్యాయిక యున్నది. వయోధర్మముచే 'వేంకటతిరుపతికవులు' కావలసిన వారు వీరు. తిరుపతికవికంటె వేంకట శాస్త్రిగారు ఒక సంవత్సరము ముందు పుట్టినవారు. సహసాఠిదశలో దిరుపతి శాస్త్రిగారికి బద్యలక్షణములు వేంకటశాస్త్రిగారే చెప్పినట్లు స్పష్టము. ఈ పద్యముదానికి దారకాణ.
వితతాత్మీయ శతావధాన కవితా విద్యాపయోరాశి, సం
భృత శిష్యాంబుద వాజ్మయామృత రసప్రీతాఖిలాంధ్ర క్షమా
ధృత రజ్యద్రసికావతంసకృత వందిస్తోత్రమాలా విభూ
షితు మా వేంకటశాస్త్రి నే బొగడెదన్ శిష్యస్వరూపంబునన్.
తిరుపతికవి యప్రతిమానమైన పాండితీ ప్రతిభయు జెళ్ళపిళ్ళకవి యసాధారణమైన మేధాబలమును బలసి తిరుపతి వేంకటేశ్వరులను దెలుగుకవులలో నగ్రేసరుల నొనరించినది. తిరుపతి లేనిదే వేంకటేశ్వ